క్షయవ్యాధి నివారణ అందరి బాధ్యత

25 Mar, 2023 01:52 IST|Sakshi
డాక్టర్‌ మధుకు ప్రశంస పత్రం అందిస్తున్న కలెక్టర్‌

ములుగు: క్షయ వ్యాధి నివారణ అందరి బాధ్యతని కలెక్టర్‌ కృష్ణా ఆదిత్య అన్నారు. ఈ మేరకు ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా వైద్యశాఖ ఆ ధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన క్షయ వ్యాధి నిర్మూలన అవగాహన కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై ఉ త్తమ సేవలు అందించిన వారికి ప్రశంస పత్రాలను అందించారు. వైద్య శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ల ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ క్షయ నిర్మూలనకు వైద్యశాఖతో పాటు స్వ చ్ఛంద సంస్థ, యువత సంయుక్తంగా పోరాడాలని సూచించారు. జిల్లాలోని ఏ గ్రామంలో క్షయ వ్యాధి లేకుండా చేసేందుకు ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారించాలన్నారు. ప్రతి పీహెచ్‌సీ ల్లో క్షయ వ్యాధి పరీక్షలు నిర్వహించాలని, పాజిటివ్‌ వచ్చిన వారి విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా వెంటనే వైద్య సేవలు అందించాలన్నారు. 2025 నాటికి టీబీని అంతం చేయడానికి దేశం కట్టుబడి ఉందన్నారు. డీఎంహెచ్‌ఓ అల్లెం అప్పయ్య మాట్లాడుతూ రెండు వారాల పాటు జ్వరం, అలస ట, దగ్గు, తెమడ వంటి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలన్నారు. అంతకుముందు డీఎంహెచ్‌ఓ ఆధ్వర్యంలో పోగ్రాం అధికారి డాక్టర్‌ పోరిక రవీందర్‌ ఏరియా ఆస్పత్రి నుంచి ఆర్టీసీ బస్టాండ్‌ వరకు సిబ్బందితో అవగాహన ర్యాలీ నిర్వహించగా జెడ్పీ వైస్‌చైర్‌ పర్సన్‌ బడె నాగజ్యోతి జెండా ఊపి ప్రారంభించారు. మాస్‌ మీడియా అధికా రి తిరుపతయ్య, డీపీఎం సమ్మయ్య, సీహెచ్‌ఓ దు ర్గారావు, సంపత్‌రావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు