ఈవీఎంల ర్యాండమైజేషన్‌ పూర్తి | Sakshi
Sakshi News home page

ఈవీఎంల ర్యాండమైజేషన్‌ పూర్తి

Published Sun, Nov 19 2023 1:16 AM

సమావేశంలో మాట్లాడుతున్న ఇలా త్రిపాఠి - Sakshi

ములుగు: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచిన ఈవీఎంల రెండో విడత ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సాధారణ ఎన్నికల అధికారి సవిన్‌ భన్‌షల్‌, రిటర్నింగ్‌ అధికారి ఐటీడీఏ పీఓ అంకిత్‌తో కలిసి శనివారం వివిధ రాజకీయ పార్టీల సమక్షంలో బ్యాలెట్‌ యూనిట్‌, కంట్రోల్‌ యూనిట్‌, వీవీ ప్యాట్స్‌ రాండమైజేషన్‌ ప్రక్రియ నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 378 కంట్రోల్‌ యూనిట్లు, 378 బ్యాలెట్‌ యూనిట్లకు సంబంధించిన 424 వీవీ ప్యాట్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఏదైనా ఇబ్బందిలో ఉంటే సరిచేయడానికి హైదరబాద్‌లోని ఈసీఐఎల్‌ ఇంజనీర్ల సహాయ, సహకారాలు కోరినట్లు కలెక్టర్‌ తెలిపారు. ఎన్నికలకు రాజకీయ పార్టీల నాయకులు ప్రజలు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ డీఎస్‌ వెంకన్న, తహసీల్దార్‌ విజయ్‌ భాస్కర్‌, ఈడీఎం దేవేందర్‌, సిబ్బంది, వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement