న్యాయ సేవలపైఅవగాహన పెంచుకోవాలి | Sakshi
Sakshi News home page

న్యాయ సేవలపైఅవగాహన పెంచుకోవాలి

Published Sun, Nov 26 2023 1:40 AM

-

కొల్లాపూర్‌: న్యాయ సేవలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని కొల్లాపూర్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు న్యాయమూర్తులు ఆర్‌వీఎస్‌ఎస్‌ మిథున్‌తేజ, జ్యోత్స్న గుంటి అన్నారు. శనివారం పట్టణంలోని ఎస్సీ గురుకుల విద్యాలయంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సదస్సులో న్యాయమూర్తులు మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులను దుర్వినియోగం చేస్తూ.. ఇతరులకు ఇబ్బందులు కలిగించకూడదన్నారు. హక్కుల ఉల్లంఘన జరిగితే న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చన్నారు. న్యాయ సేవల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్‌ జ్యోత్స్న, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వసంతరెడ్డి, న్యాయవాదులు భాస్కర్‌రెడ్డి, నిరంజన్‌, ముబీన్‌ తదితరులు పాల్గొన్నారు.

రేపు ఖోఖో జట్టుఎంపికలు

కందనూలు: రాష్ట్రస్థాయి జూనియర్స్‌ ఖోఖో చాంపియన్‌షిప్‌ నాగర్‌కర్నూల్‌ జిల్లా ఖోఖో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం జిల్లాకేంద్రంలో జిల్లా జట్టు కోసం ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఇన్‌చార్జ్‌ నిరంజన్‌యాదవ్‌, ప్రధాన కార్యదర్శి రమేష్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికలో పాల్గొనే క్రీడాకారులు పాఠశాల బోనోఫైడ్‌, ఎస్సెస్సీ, ఆధార్‌ కార్డు, రెండు ఫొటోలతో సోమవారం ఉదయం 9 గంటలకు జెడ్పీ మైదానంలో రిపోర్ట్‌ చేయాలని కోరారు. పూర్తి వివరాలకు సెల్‌ నంబర్లు 94934 50450, 98581 33052లను సంప్రదించాలని సూచించారు.

రూ.1.20 లక్షల విలువ గల మద్యం సీజ్‌

నాగర్‌కర్నూల్‌ క్రైం: ఆటోలో అక్రమంగా తరలిస్తున్న రూ.1.20 లక్షల విలువ గల మద్యాన్ని ఎకై ్సజ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్న సంఘటన జిల్లాకేంద్రంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఎకై ్సజ్‌ సీఐ ఏడుకొండలు సమాచారం ప్రకారం.. జిల్లాకేంద్రలోని సవేరా బార్‌ నుంచి అక్రమంగా 10 కాటన్ల మద్యాన్ని ఆటోలో తీసుకువెళ్తుండగా సమాచారం అందుకున్న ఎకై ్సజ్‌శాఖ అధికారులు దాడిచేసి ఆటోలో ఉన్న మద్యాన్ని స్వాధీనం చేసుకుని స్థానిక ఎకై ్సజ్‌ స్టేషన్‌కు తరలించి మద్యాన్ని లేబుళ్లను స్కాన్‌ చేయడంతో సవేరా బార్‌కు చెందిన మద్యంగా గుర్తించి బార్‌ను సీజ్‌ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎకై ్సజ్‌ సీఐ వెల్లడించారు.

Advertisement
Advertisement