cannibalism: నాగుపామును మింగేసిన మరో నాగుపాము

28 Jun, 2021 17:55 IST|Sakshi

భువనేశ్వర్‌ : కన్నిబలిజం.. ఈ మాట అంత పాపులర్‌ కాకపోయినా.. అప్పుడప్పుడూ తెరపైకి వస్తూ ఉంటుంది. కన్నిబలిజాన్ని తెలుగులోకి తర్జుమా చేస్తే ‘స్వజాతి భక్షణ’ అని అర్థం. మరింత వివరంగా చెప్పాలంటే ఓ మనిషి, మరో మనిషిని తినటం.. ఓ సింహం మరో సింహాన్ని తినటం అన్న మాట. తాజాగా, కన్నిబలిజానికి సంబంధించిన ఓ వార్త ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

ఒరిస్సా, కదురా జిల్లాలోని బాలకటి గ్రామంలో నాలుగు అడుగుల నాగుపాము.. మూడు అడుగుల నాగుపామను చుట్టి మింగేసింది. ఇది గమనించిన స్థానికులు సుదేందు మాలిక్‌ అనే వన్యప్రాణి సంరక్షకుడికి ఫోన్‌ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అతడు.. పామను పట్టుకుని అడవిలో వదిలేశాడు. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ 3 అడుగుల నాగుపామును మింగేసినందుకు.. 4 అడుగుల నాగుపాము మీద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయండి’’.. ‘‘నాదో అనుమానం.. వన్యప్రాణి సంరక్షకుడికి ఎవరు ఫోన్‌ చేశారు.. 3 అడుగుల పామా? నాలుగు అడుగుల పామా?’’ అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

చదవండి : ఆన్‌లైన్‌ క్లాస్‌లోకి హ్యాకర్‌.. పోర్న్‌ వీడియోలతో రచ్చ

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు