గోటితో గిన్నిస్‌

27 May, 2022 00:51 IST|Sakshi

యాపిల్‌ కనిపించగానే మీరయితే ఏం చేస్తారు? కత్తికోసం వెదుకుతారు. లేదంటే నోటితో కొరుక్కు తింటారు. కానీ పాకిస్తాన్‌కు చెందిన 70 ఏళ్ల నసీముద్దీన్‌కు చేతిగోరు చాలు. నిమిషంలోపే ఒకటి, రెండు కాదు... ఏకంగా 21 యాపిల్స్‌ను చేతితో క్రష్‌ చేసి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డును బద్దలు కొట్టేశాడు. అంతకుముందు నిమిషానికి 8 యాపిల్స్‌ను క్రష్‌ చేసిన రికార్డు ఉండగా అదనంగా మరో 13 యాపిల్స్‌ను  గోటితో కట్‌ చేసి ఆ రికార్డును బ్రేక్‌ చేశాడు.

యాపిల్‌ చేతిలోకి వచ్చాక గ్రిప్‌ దొరకగానే... గోటితో కట్‌ చేసి, చేతితో చిదిమేస్తాడు. అలా నిమిషంలోపే 21 యాపిల్స్‌ను కట్‌ చేశాడు. 2021 ఆగస్టు 22న కరాచీలో ఈ రికార్డును ప్రదర్శించగా.. ఈనెల 24 గిన్నిస్‌ రికార్డును అధికారికంగా ప్రకటించింది. వెల్డర్‌ అయిన నసీముద్దీన్‌ చేతులకు ఆ బలం, ఆయన చేస్తున్న పనివల్ల వచ్చిందట.  

మరిన్ని వార్తలు