సుధా భరద్వాజ్.. జైలు నుంచి విడుదల

9 Dec, 2021 19:17 IST|Sakshi

ముంబై: ఎల్గార్‌ పరిషత్‌–మావోయిస్టులతో సంబంధాల కేసులో అరెస్టయిన ప్రముఖ మహిళా న్యాయవాది, సామాజిక కార్యకర్త సుధా భరద్వాజ్‌(60) గురువారం జైలు నుంచి విడుదలయ్యారు. మూడేళ్లకు పైగా ఆమె జైలు జీవితం గడిపిన ఆమెకు బాంబే హైకోర్టు  డిసెంబర్‌ 1న డిఫాల్ట్‌ బెయిల్‌ మంజూరు చేసింది. బెయిల్‌ కండీషన్‌తో పాటు ఆమెను ఎప్పుడు విడుదల చేయాలన్నది ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టే నిర్ణయిస్తుందని తెలిపింది. హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎన్‌ఐఏ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఎన్‌ఐఏ అప్పీల్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.


కాగా, రూ. 50 వేల పూచీకత్తుతో సుధా భరద్వాజ్‌ను విడుదల చేయాలని ప్రత్యేక కోర్టు బుధవారం ఆదేశించింది. ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత, భరద్వాజ్ గురువారం మధ్యాహ్నం బైకుల్లా మహిళా జైలు నుంచి విడుదలయ్యారు. కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సాగించిన కుట్రలో భాగస్వామిగా మారారని ఆరోపిస్తూ వరవరరావు, సుధా భరద్వాజ్ సహా 16 మంది సామాజిక కార్యకర్తలు, మేధావులను 2018 ఆగస్టులో ఎన్‌ఐఏ అరెస్ట్‌ చేసింది. (Nagaland Firing: డ్రెస్‌ మార్చి, మృతదేహాల దగ్గర ఆయుధాలు పెట్టబోయారు)

మరిన్ని వార్తలు