ఎయిమ్స్‌ డైరెక్టర్‌గా శ్రీనివాస్‌

24 Sep, 2022 06:07 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఢిల్లీ ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) డైరెక్టర్‌గా డాక్టర్‌ ఎం.శ్రీనివాస్‌ శుక్రవారం నియమితులయ్యారు. డాక్టర్‌ రణదీప్‌ గులేరియా స్థానంలో ఆయన్ను ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్‌ నియామకాల కమిటీ నియమించినట్టు సిబ్బంది శిక్షణ విభాగం తెలిపింది.

శ్రీనివాస్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌ డీన్‌గా ఉన్నారు. అంతకుముందు ఢిల్లీ ఎయిమ్స్‌లోనే ప్రొఫెసర్‌గా పనిచేశారు. కర్ణాటకలోని మైసూరుకు చెందిన శ్రీనివాస్‌ అక్కడే ఎంబీబీఎస్, ఎంఎస్, ఢిల్లీ ఎయిమ్స్‌లో సూపర్‌ స్పెషాలిటీ విభాగంలో పీడియాట్రిక్‌ సర్జన్‌ (కార్డియో వ్యాస్కులర్‌ స్పెషలిస్ట్‌) కోర్సు చేశారు. 1994 నుంచి 2016 దాకా ఢిల్లీ ఎయిమ్స్‌లోనే పలు హోదాల్లో పని చేశారు.

మరిన్ని వార్తలు