2024లో అమేథీ నుంచి పోటీ చేస్తాం!

7 Mar, 2023 04:32 IST|Sakshi

లక్నో:  2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ స్థానంలో పోటీ చేస్తామని సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించింది. అక్కడ పేద మహిళల పరిస్థితి దారుణంగా మారిందని పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అక్కణ్నుంచి ఎంతోమంది ప్రముఖులు లోక్‌సభకు ఎన్నికవుతున్నప్పటికీ పేదల బతుకులు మాత్రం మారడం లేదని వాపోయారు.

ఇక యూపీలోని ఇతర ప్రాంతాల్లో ప్రజల జీవితాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నారు. ‘‘అందుకే, వచ్చే ఎన్నికల్లో అమేథీలో బడా నాయకులు కాకుండా మంచి మనసున్న వ్యక్తులు గెలుస్తారు’’ అంటూ సోమవారం ఆయన ట్వీట్‌ చేశారు. అమేథీలో పేదరికాన్ని నిర్మూలిస్తామని హామీ ఇచ్చారు. ఆ స్థానాన్ని సమాజ్‌వాదీ ప్రతిసారీ కాంగ్రెస్‌కు వదిలేస్తోంది.   అక్కడ ప్రస్తుతం కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఎంపీగా ఉన్నారు. ఆమె 2019లో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీని ఓడించారు.

మరిన్ని వార్తలు