ఫుల్‌ కిక్కు, తెగ తాగేస్తున్నారుగా.. ఐదేళ్లుగా రికార్డ్‌ సేల్స్‌!

24 Feb, 2023 07:17 IST|Sakshi

శివాజీనగర(బెంగళూరు): రాష్ట్రంలో మద్యం వినియోగం సర్కారు నిర్దేశించిన మేరకు వంద శాతాన్ని చేరుతోంది. ఇది నెలా, రెండు నెలలకో కాదు, గత ఐదేళ్లుగా మద్యం ద్వారా కాసుల వర్షం కురుస్తోంది. స్వయంగా అబ్కారీ మంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. మద్యం కొనుగోలు వయోపరిమితి 21 సంవత్సరాల నుంచి 18 ఏళ్లకు తగ్గించడంపై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో సర్కారు దిగివచ్చింది.

పాత పద్ధతిలోనే 21 ఏళ్లనే కొనసాగుతుందని ఎక్సైజ్‌ శాఖ మంత్రి కే.గోపాలయ్య తెలిపారు. గురువారం విధానపరిషత్‌ ప్రశ్నోత్తరాల సమయంలో జేడీఎస్‌ సభ్యుడు గోవిందరాజు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. వయో పరిమితిని తగ్గిస్తూ జనవరి 9న ఉత్తర్వులు జారీ చేశాం,  అయితే ఇందుకు అనేక అభ్యంతరాలు రావడంతో పరిశీలన జరిపి పాత పద్ధతినే కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
  

ఐదేళ్లుగా మద్యం ఆర్థిక లక్ష్యం సఫలం 
గ్రామాల్లో అక్రమ మద్యం అమ్మకాల గురించి అనేకచోట్ల కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. మద్యానికి బాగా గిరాకీ ఉండడంతో ఈ సంవత్సరం ఎక్సైజ్‌ శాఖ నిర్ధారించిన ఆర్థిక లక్ష్యాన్ని  దాటుతుందని చెప్పారు. గత ఐదు సంవత్సరాలు వరుసగా నిర్ధారిత లక్ష్యాన్ని చేరుకొన్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు