బీజేపీ ఎంపీకి మరోసారి తీవ్ర అస్వ‌స్థ‌త : ఎయిర్‌లిఫ్ట్‌

6 Mar, 2021 17:01 IST|Sakshi

ప్ర‌గ్యా ఠాకూర్‌కు అస్వ‌స్థ‌త  విమానం ద్వారా ముంబైకి

కోకిలాబెన్‌  ఆస్ప‌త్రికి త‌ర‌లింపు

సాక్షి,భోపాల్‌: బీజేపీ నాయ‌కురాలు, భోపాల్ ఎంపీ ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌‌ మరోసారి అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. శ్వాస తీసుకోవ‌డంలో తీవ్ర ఇబ్బందిగా ఉందని ఆమె ఫిర్యాదు చేయడంతో ఆమెను హుటాహుటిన విమానంలో ముంబైకి త‌ర‌లించారు. ప్రస్తుతం ఆమె ముంబైలోని కోకిలాబెన్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. భోపాల్‌లోని ఎంపీ కార్యాల‌యం అధికారులు ఈ వివ‌రాల‌ను మీడియాకు వెల్ల‌డించారు. 

కాగా  ప్రజ్ఞా ఠాకూర్‌  కోవిడ్-19 ప్రేరిత లక్షణాలతో గత ఏడాది డిసెంబర్‌లో ఎయిమ్స్‌లో చికిత్స పొందిన సంగతి తెలిసిందే.  2008 మాలెగావ్ బాంబు దాడిలో నిందితురాలిగా ఉన్న ఆమెకు  అనారోగ్య కారణాల రీత్యా జాతీయ దర్యాప్తు సంస్థ 2017లో బెయిల్ మంజూరు చేసింది.  2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ సింగ్‌పై 3.6 లక్షలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు