రాజకీయ పొత్తులను నియంత్రించలేం: ఈసీ

31 Oct, 2023 06:10 IST|Sakshi

న్యూఢిల్లీ: రాజకీయ పొత్తులను నియంత్రించేందుకు చట్టపరంగా తమకు ఎలాంటి అధికారమూ లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. విపక్ష కూటమికి ఇండియా అని పేరు పెట్టడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరుపుతున్న ఢిల్లీ హైకోర్టుకు ఈసీ సోమవారం ఈ మేరకు తన స్పందన తెలియజేసింది.‘‘మాకు పారీ్టల నమోదుకు, ఎన్నికల నిర్వహణకు మాత్రమే అధికారముంది.

అంతే తప్ప రాజ్యాంగంలోని ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం రాజకీయ పొత్తులకు నియంత్రిత కూటములుగా గుర్తింపునిచ్చే అధికారం కూడా లేదు. పైగా కేరళ హైకోర్టు గత తీర్పు మేరకు ఈ కూటములను చట్టబద్ధమైన సంస్థలుగా కూడా పరిగణించలేం’’ అని వివరించింది. విపక్ష కూటమికి ఇండియా అని పేరు పెట్టుకోవడం తాలూకు చట్టబద్ధత తమ పరిధిలోని అంశం కాదని వివరించింది. విపక్ష కూటమికి ఇండియాగా పేరు పెట్టడాన్ని సవాలు చేస్తూ గిరీశ్‌భరద్వాజ్‌ అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు