Sugarcane FRP Increased: చెరుకు రైతులకు గుడ్‌న్యూస్‌

25 Aug, 2021 15:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: చెరుకు రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. క్వింటాలు చెరుకుకు 290 రూపాయల లాభదాయక ధర(ఫెయిర్‌ అండ్‌ రెమ్యునరేటివ్‌ ప్రైస్‌- ఎఫ్‌ఆర్‌పీ) ఇచ్చేందుకు కేంద్రం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో ఐదు కోట్ల మంది చెరుకు రైతులు, ఐదు కోట్ల మంది కూలీలకు ప్రయోజనం చేకూరనుంది. చెరుకు రైతులకు గ్యారంటీ ధర దక్కనుంది.

అదే విధంగా.. దేశీయంగా చక్కెర ఉత్పత్తికి  ప్రోత్సాహం అందనుంది. మిగులు చెరుకుతో ఇథనాల్ ఉత్పత్తి చేసే అవకాశం కలుగుతుంది. ఈ మేరకు.. కేంద్ర ఆహార, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖా మంత్రి పీయూష్‌ గోయల్‌ మీడియాకు బుధవారం వివరాలు వెల్లడించారు.

చదవండి: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. కేంద్ర మంత్రి నారాయణ రాణె అరెస్ట్‌

మరిన్ని వార్తలు