తెర్రాం ఎన్‌కౌంటర్‌: బస్తర్‌ రేంజ్‌ ఐజీ కీలక వ్యాఖ్యలు

7 Apr, 2021 12:18 IST|Sakshi

రాయ్‌పూర్‌: బీజాపూర్‌ జిల్లా తర్రెం ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో మావోయిస్టులు విడుదల చేసిన లేఖను బస్తర్‌ రేంజ్‌ ఐజీ సుందర్‌రాజు ఖండించారు. ఎన్‌కౌంటర్‌పై పొంతలేని సమాధానాలు చెబుతున్నారని, మావోయిస్టుల మాటల్లో వైరుధ్యం కనిపిస్తోందన్నారన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య శనివారం జరిగిన ఎదురు కాల్పుల్లో 24 మంది జవాన్లు అమరులైన విషయం విదితమే. అయితే, ఈ ఘటనలో మృతి చెందిన మావోయిస్టుల వివరాలకు సంబంధించి పొంతనలేని సమాధానాలు వస్తున్నాయన్న ఐజీ సుందర్‌రాజు... ‘‘భద్రతా దళాల నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని, యూనిఫాం, బూట్ల లూటీ చేశారు. 

కానీ నక్సల్స్ మాత్రం 14 ఆయుధాలు, రెండు వేలకు పైగా తూటాలు లూటీ చేశామని చెప్పడంలో నిజం లేదు. నక్సలైట్లు తప్పుదోవ పట్టించే ప్రకటనలు విడుదల చేస్తున్నారు. మినపా ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారని మొదట ప్రకటించారు. అయితే, వారం రోజుల తర్వాత,  30 మంది సహచరులు మరణించారని చెబుతున్నారు. తాజాగా జరిగిన తర్రెం ఎన్‌కౌంటర్ లో నలుగురు నక్సలైట్లు మృతి చెందారని చెబుతూ ఐదుగురు నక్సల్స్ ఫోటోలు విడుదల చేశారు’’ అని మావోయిస్టుల తీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు.

చదవండి: తెర్రాం ఎన్‌కౌంటర్‌: హిడ్మా లక్ష్యంగా కేంద్రం కీలక నిర్ణయం
నెత్తురోడిన బస్తర్‌ 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు