ప్రధానికి పుల్‌ సపోర్ట్‌ ఇస్తానంటున్న మమతా బెనర్జీ

28 Feb, 2022 19:21 IST|Sakshi

కోల్‌కతా: రాజకీయంగా ఎప్పుడూ నువ్వా-నేనా అంటూ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ప్రధాని నరేంద్రమోదీ తలపడతారనేది అందరికీ తెలిసిన విషయమే. తాజగా ఫైర్‌ బ్రాండ్‌ దీదీ ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో ప్రధాని మోదీకి పూర్తి మద్దతు తెలిపారు. ఉక్రెయిన్ అంశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల‌కు సంపూర్ణ మ‌ద్దతు తెలుపుతూ మమతా ఓ లేఖను ప్రధానికి పంపారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా తీవ్రమైన సంక్షోభం ఏర్పడిందని, వాటి నుంచి బయటపడటం ఎంతైనా అవసరం ఉందన్న మమతా.. అందుకోసం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడాన్ని పరిశీలించాలని ఆమె కోరారు. 

ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థులను త్వరితగతిన దేశానికి రప్పించాలిని కోరారు. స‌హకార స‌మాఖ్య వ్య‌వ‌స్థ‌లో ఉన్న ఓ సీనియ‌ర్ ముఖ్య‌మంత్రిగా ఉక్రెయిన్ సంక్షోభం విష‌యంలో మ‌న దేశ నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు మమ‌త ఆ లేఖ‌లో తెలిపారు. సంక్షోభ స‌మ‌యంలో దౌత్య వ్య‌వ‌హారాల‌ను స‌రైన రీతిలో అమ‌లు చేస్తార‌ని ఆశిస్తున్న‌ట్లు దీదీ త‌న లేఖ‌లో తెలిపారు. తీవ్రమైన అంతర్జాతీయ సంక్షోభ సమయాల్లో ఒక దేశంగా ఐక్యంగా నిలబడాల్సి అవసరం ఎంతైనా ఉందని అందుకు మన దేశీయ విబేధాలను పక్కనపెట్టి ఉండాలని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్‌ ఉన్నందున, ప్రపంచానికి శాంతియుత పరిష్కారాన్ని అందించడానికి భారత్‌ నాయకత్వం వహించాలని ప్రధానికి సూచించారు.

మరిన్ని వార్తలు