సీఎం మమతా బెనర్జీకి రూ.5,000 జరిమానా

1 Jul, 2021 01:11 IST|Sakshi

కోల్‌కతా: నారద కుంభకోణం కేసులో ఇద్దరు మంత్రులు సహా తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకుల అరెస్ట్‌ను నిరసిస్తూ సీబీఐ కార్యాలయం ఎదుట నిరసనలకు సంబంధించి వాదనలు వినిపించడానికి పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వానికి కోల్‌కతా హైకోర్టు అనుమతి ఇచ్చింది. సరైన సమయంలో అఫిడవిట్‌ దాఖలు చేయడంలో విఫలమైనందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి రూ.5,000 జరిమానా విధించింది. నారద కేసులో తృణమూల్‌ కాంగ్రెస్‌ అఫిడవిట్లను రికార్డు చేయడానికి నిరాకరిస్తూ కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. హైకోర్టులో అఫిడవిట్ల దాఖలుకు అనుమతి కోరుతూ తాజాగా మరో పిటిషన్‌ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, సరైన సమయంలో అఫిడవిట్‌ దాఖలు చేయకపోవడంతో కోర్టు జరిమానా విధించింది.   

మరిన్ని వార్తలు