వారికి విముక్తి ఎప్పుడో?!

23 Jun, 2021 14:58 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కుటుంబ సభ్యుల్ని కోల్పోతేనే తట్టుకోలేం. వారి జ్ఞాపకాలతో భారంగా కాలం వెళ్లదీస్తాం. కానీ ఓ మహిళ తన భర‍్తను కోల్పోతే భరించడం ఎంతో కష్టం. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు కరువై, సమాజం నుంచి వచ్చే చీత్కారాలు, ఆర్ధికంగా వెనకబాటు, పిల్లల పోషణ ఇలా అన్నీ విషయాల్లో భర్తను కోల్పోయిన భార్యలు నరకాన్ని అనుభవిస్తున్నారు. అలాంటి వారి కోసం ఐక్యరాజ్య సమితి ప్రతిఏడు జూన్‌ 23న  అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం జరుపుతోంది.  వారికి విముక్తి కలిగించేందుకు కృషి చేస్తోంది. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం.. ప్రపంచంలో వితంతువులు 25కోట‍్ల మందికి పైగా ఉన్నారు. వారిలో 10 కోట్ల మంది తీవ్ర పేదరికాన్ని అనుభవిస్తున్నారు. ప్రస్తుత కరోనా సంక్షొభంలో  కారణంగా వారి జీవనం మరింత దయనీయంగా మారింది. 

నేపథ్యం 
"ఇన్‌ విజుబుల్‌ ఇన్‌ విజుబుల్‌ ప్రాబ్లమ్స్‌" అనే థీమ్‌తో జూన్‌ 23న వితంతువుల దినోత్సవంగా నిర్ణయించింది. భర్త జీవించినంత కాలం ఆమెను గుర్తించిన సమాజం.. వితంతువుగా మారడంతో అదే సమాజం నుంచి ఎన్నో అవమానాల్ని ఎదుర్కొంటుంది. చట్టాల్ని అమలు చేసే ప్రభుత్వాలు సైతం వారికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వలేకపోతున్నాయి. 

చరిత్ర 
డిసెంబర్‌ 23, 2010లో ఐకరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో జూన్‌ 23ను వితంతు దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది.  అంతకు ముందు లుంబా ఫౌండేషన్  జూన్ 23న వితంతు దినోత్సవాన్ని నిర్వహించేంది. 2005 నుంచి 2010 వరకు ఐదేళ్ల పాటు లుంబా ఫౌండేషన్‌ ఈ పనిని చేసింది. దీనికి కారణరం లేకపోలేదు.. లూంబా వ్యవస్థాపకుడు రజిందర్ తల్లి పుష్పవతి లూంబా 1954 జూన్ 23న వితంతువు అయ్యారు. దీంతో పడిన కష్టాలు... వితంతువుగా ఆమె ఎదుర్కొన్న సమస్యలు... వాటిని ఆమె ఎదిరించిన తీరును స్ఫూర్తిగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 

చదవండి: ఏది నిజం, అక్కడ అమ్మాయిలు ఉన్నట్లా! లేనట్లా?

మరిన్ని వార్తలు