వైరల్‌: ఈ కుక్కకి రోడ్ల పై చెత్త వేస్తే నచ్చదు..

5 May, 2021 15:44 IST|Sakshi

సాధారణంగానే కుక్కలకు మానవులు ఎలా ప్రవర్తించాలి, ఏది ఎలా చేయాలి అనే అంశాలపై  శిక్షణను ఇచ్చినప్పుడు అవి తూచా తప్పకుండా పాటించడం మనకి తెలుసు. ఒక్కోసారి మనం మర్చిపోయినా అవి మర్చిపోవు. ఇదే క్రమంలో ఈ కుక్క రోడ్ల పై ఎవరినీ చెత్త వేయనివ్వడం లేదు. అసలు  ఎవరు ఈ కుక్క ఇలా ట్రైనింగ్‌ ఇచ్చారో గానీ ఇది చేసిన పని చూస్తే మాత్రం ఎవరికైనా ఆశ్చర్యం వేయక మానదు. అదే మున్సిపాలిటీ అధికారులు గనుక చూస్తే స్వచ్ఛ భారత్‌కు దీన్నే బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపిక చేస్తారేమో.. అసలు ఇంతకీ ఏం  చేసిందో ఈ శునకం తెలుసుకుందాం.

వివరాల్లోకి వెళితే.. కారు లోపల కూర్చున్న ఓ వ్యక్తి రోడ్డుపై పేపర్ విసురుతాడు. అకస్మాత్తుగా, ఆ కారు గుండా వెళుతున్న ఒక కుక్క, ఆ వ్యక్తి  కారోలోంచి నిర్లక్ష్యంగా పారేసిన ప్లాస్టిక్ కవర్ని తన నోటితో ఎత్తుకొని తిరిగి కారులోకి వదిలేస్తుంది. ఇదే కుక్క స్థానంలో మనిషే ఉండుంటే చూసి చూడనట్లు వెళ్లిపోయేవాడు. కానీ ఆ కుక్క మాత్రం అందుకు భిన్నంగా శుభ్రతకు సంబంధించిన ఓ పాఠాన్నే మనకు నేర్పిందనే చెప్పాలి. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి సుధా రామెన్ తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. “ప్రియమైన మానవులారా, ఇది మనకు ఒక పాఠం.. ఈ కుక్క తనకిచ్చిన శిక్షణను అనుసరిస్తున్నందుకు అభినందించాల్సిందే ” అని తన పోస్ట్‌కు ఈ శీర్షికను పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారి నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది. ఈ కుక్క చేసిన పనికి నెటిజన్లు మనం ఇలాంటివి చూసైనా మారాలంటూ కామెంట్లు పెడుతున్నారు.

( చదవండి: హమ్మా! ​కా​​కికే షాకిచ్చిందిగా..!! వైరల్‌ వీడియో )

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు