22 మందిపై కేసులు‌.. 200 మంది అరెస్ట్

27 Jan, 2021 16:07 IST|Sakshi

300 మంది పోలీసులకు గాయాలు

సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజు రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసిన సంగతి తెలిసిందే. రైతు గణతంత్ర పరేడ్‌ పేరిట రైతులు నిర్వహించిన ఈ ర్యాలీలో నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. నిరసనకారులు బారికేడ్లను తోసుకుని వచ్చి మరి పోలీసులపై దాడి చేశారు. ఈ హింసాత్మక ఘటనల్లో దాదాపు 300 మంది పోలీసులు గాయపడినట్లు సమాచారం. ఇక దాడులకు సంబంధించి 22 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా.. దాదాపు 200 మందిని అరెస్ట్‌ చేశారు. ఇక రైతు ర్యాలీకి సంబంధించి జారీ చేసిన ఎన్‌ఓసీని ఉల్లంఘించినందుకు గాను స్వరాజ్ అభియాన్ నాయకుడు యోగేంద్ర యాదవ్‌తో పాటు ఇతర రైతు సంఘాల నాయకులు దర్శన్ పాల్, రజిందర్ సింగ్, బల్బీర్ సింగ్ రాజేవాల్, బుటా సింగ్ బుర్జ్‌గిల్, జోగిందర్ సింగ్ ఉగ్రహాలతో సహా మరి కొందరిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.
(చదవండి: వైరల్‌: 15 అడుగులో గోతిలో దూకిన పోలీసులు)

హింసాత్మక ఘటనల నేపథ్యంలో కేంద్రం ఢిల్లీ వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేయడమే కాక రాజధానిలో అదనపు బలగాలను మోహరించించింది. ఎర్రకోట, జామా మసీద్‌ మెట్రో స్టేషన్లు మూసివేయడమే కాక సెంట్రల్‌ ఢిల్లీకి వచ్చే అన్ని మార్గాల్లోనూ ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. ఇక నిన్న రాజధానిలో తలెత్తిన హింసాత్మక ఘటనలకు, తమకు ఎలాంటి సంబంధం లేదని రైతు సంఘాల నాయకులు ప్రకటించారు. కేంద్రం గందరగోళ పరిస్థితులను సృష్టించిందని.. అందువల్లే హింసాత్మక ఘటనలు తలెత్తాయి అని.. అల్లర్ల వెనక కుట్ర కోణం దాగి ఉందని వెల్లడించారు. 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు