అక్కడ డ్రైవర్లకు ‘గరం చాయ్‌’.. కారణం ఏంటో తెలుసా?

2 Dec, 2021 21:23 IST|Sakshi

కోల్‌కతా: రోడ్డు ప్రమాదాలు అరికట్టడానికి పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో ట్రాఫిక్‌ పోలీసులు వినూత్న విధానానికి శ్రీకారం చుట్టారు. రాత్రి సమయంలో లేదా తెల్లవారుజామున రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. డ్రైవర్ల తీవ్ర అలసట, నిద్రలేమి కారణంగా అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయన్న విషయం తెలిసిందే.

ఈ విషయాన్ని గుర్తించిన కోల్‌కతా ట్రాఫిక్ పోలీసులు ప్రమాదాలు నివారించడానికి వాహన డ్రైవర్లకు ‘గరం చాయ్’ అందిస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ ప్రమాదం నేపథ్యంలో ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు  ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.ఆ ప్రమాదంలో లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు తొలుత అనుమానించగా.. అతడు మద్యం సేవించలేదని పోస్టుమార్టం రిపోర్టులో తెలిసింది.

డ్రైవర్‌ నిద్ర మత్తు ఉండటం వల్ల ప్రమాదం జరిగినట్లు పోలీసులు అంచనా వేశారు. అయితే రాత్రివేళ నిద్రలేమితో అలసిపోయిన డ్రైవర్లను యాక్టివ్‌గా ఉంచడానికి ‘గరం చాయ్’ అందిస్తున్నామని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. ముఖ్యంగా హైవేలపై వాహనాలకు సంబంధించిన పత్రాలను తనిఖీ చేస్తున్న సమయంలో వాహన డ్రైవర్లకు వేడి వేడి ‘టీ’ అందించాలని నిర్ణయం తీసుకున్నామని ట్రాఫిక్‌ పోలీసులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు