కన్నడ సినీ నటుడు నాగభూషణ్‌ అరెస్టు

2 Oct, 2023 05:45 IST|Sakshi

బెంగళూరు:  కారును వేగంగా, నిర్లక్ష్యంగా నడిపి, ఒక మహిళ మరణానికి కారణమైన కన్నడ సిటీ నటుడు నాగభూషణ్‌ ఎస్‌.ఎస్‌.ను పోలీసులు అరెస్టు చేశారు. నాగభూషణ్‌ కారు శనివారం రాత్రి బెంగళూరులోని వసంతపుర ప్రధాన రహదారిపై కృష్ణ(58), ప్రేమ(48) అనే దంపతులపైకి దూసుకెళ్లింది. వారిద్దరూ ఫుట్‌పాత్‌పై నడుస్తుండగా ఈ సంఘటన జరిగింది. తర్వాత కారు కొద్ది దూరం వెళ్లి, కరెంటు స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది.

ఈ సమయంలో కారును నాగభూషణ్‌ నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో ప్రేమ మృతిచెందగా, కృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు. కారును నడిపిన నాగభూషణ్‌ను అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. ప్రమాద సమయంలో మద్యం సేవించి ఉన్నాడో లేదో తెలుసుకొనేందుకు అతడి రక్తపు నమూనాలు సేకరించామని అన్నారు. కారును స్వా«దీనం చేసుకున్నామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

మరిన్ని వార్తలు