‘వ్యాక్సిన్‌ తీసుకుని మోదీకి బహుమతిగా ఇద్దాం’

17 Sep, 2021 10:50 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్‌ మాండవ్య ఇప్పటి వరకు ఇంకా ఎవరైన కోవిడ్‌ -19 వ్యాక్సిన్‌ తీసుకోని వాళ్లు ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా వ్యాక్సిన్‌ తీసుకున్ని దాన్ని గిఫ్గ్‌గా ఇవ్వండంటూ...ప్రజలను కోరారు.  భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కూడా శుక్రవారం(సెప్టెంబర్‌ 17) మోదీ పుట్టిన రోజు సందర్భంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియతో చారిత్రక రికార్డు సృష్టించాలని చూస్తోంది. (చదవండి: యూఎస్‌ నేషనల్‌ సైన్స్‌ బీ పోటిల్లో రెండో స్థానంలో ఢిల్లీ బాలుడు)

ఈ క్రమంలో శుక్రవారం ఒక్కరోజే దాదాపు ఎనిమిది లక్షల మంది వాలంటీర్‌లతో రెండు కోట్టకు పైగా వ్యాకిన్‌నేషన్‌  ప్రక్రియను చేపట్టి విజయవంతం చేయాలని  లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు మోదీ 20 ఏళ్ల ప్రజా సేవకు గ్తురుగా "సేవా సమర్పణ అభియన్‌" అనే పేరుతో 20 రోజుల మోగా ఈవెంట్‌ నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.  అంతేకాక పలు సేవకార్యక్రమాలను చేయనున్నట్లు బీజేపీ పేర్కొంది. మరోవైపు కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవ్య కూడా వ్యాక్సిన్‌ వేసుకోనివాళ్లు వ్యాక్సిన్‌ తీసుకుని "మోదీ బర్త్‌ డేకి బహుమతిగా ఇద్దాం" అంటూ ట్విట్టర్‌లో ప్రజలకు పిలుపునిచ్చారు. 

(చదవండి: వ్యాక్సిన్‌ వేసుకుంటేనే జీతం.. తమిళి సై టీకా మెలిక)

మరిన్ని వార్తలు