గర్భం వద్దనుకుంటే భర్త అనుమతి అవసరం లేదు: హైకోర్టు

27 Sep, 2022 21:40 IST|Sakshi

కొచ్చి: గర్భం వద్దనుకుంటే మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ యాక్ట్‌ (ఎంటీపీ యాక్ట్‌ కింద 20 నుంచి 24 వారాల గర్భాన్ని తొలగించుకునే హక్కు) కింద భర్త అనుమతి అవసరం లేదని కేరళ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు భర్త నుంచి విడిపోయానని చెప్పుకునే మహిళ సైతం తన గర్భాన్ని తొలిగించాలనుకుంటే ఎంటీపీ యాక్ట్‌ కింద భర్త అనుమతి అవసరం లేదంటూ కేరళ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది.

గర్భిణీ స్తీకి చట్టబద్దంగా విడాకులు తీసుకున్న లేదా వింతంతువు కానప్పటికీ గర్భధారణ సమయంలో వైవాహిక జీవితంలో పలు మార్పులు వస్తే తాను ప్రెగ్నెన్సీని కొనసాగించమనే హక్కు భర్తకు లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు పిటిషనర్‌ తాను డిగ్రీ చదువుతుండగా అదే ప్రాంతంలో బస్సు కండక్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని తన కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నట్లు పిటిషన్‌లో పేర్కొంది. వివాహం అనంతరం తన భర్త ఆమె తల్లి కట్నం కోసం వేధిస్తూ అసభ్యంగా ప్రవర్తించారని తెలిపింది.

అదే సమయంలో తాను ప్రెగ్నెంట్‌గా ఉండటంతో మరింత వేధింపులు అధికమయ్యాయని, దీనికి తోడు ఎలాంటి ఆర్థిక భరోసా ఇవ్వకపోవడంతో అతడిని విడిచి వేరుగా ఉంటున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో ఆమె తన గర్భాన్ని తొలగించుకుందామని ఆస్పత్రికి వెళ్లితే వైద్యులు అందుకు నిరాకరిచండమే కాకుండా విడాకులు తీసుకున్నట్లు పత్రాలు సమర్పించాలని చెప్పారు.

దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఈ కేసును విచారిస్తున్న జస్టిస్‌ వీజీ అరుణ్‌ వింతంతువు లేదా చట్ట బద్ధంగా విడిపోయిన వాళ్లకు వర్తించే ఎంటీపీ చట్టంలోకి గర్భధారణ సమయంలో వైవాహిక జీవితంలో మార్పులు సంభవించిన మహిళలను కూడా చేరుస్తూ చారిత్రాత్మక తీర్పుని వెలువరించారు. పైగా సదరు మహిళలకు కూడా ఈ చట్టం వర్తిస్తుందని స్పష్టం చేశారు. అంతేగాదు  సదరు పిటిషనర్‌కి గర్భం తొలగించుకునేందుకు అనుమతించడమే కాకుండా అందుకు అవసరమైన ఆదేశాలు కూడా జారీ చేశారు.
(చదవండి: కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల వేళ ఎదురవుతున్న సంక్షోభాలు... ఆదుకోమంటూ ఆ నాయకుడికి పిలుపు)

మరిన్ని వార్తలు