లోక్‌సభ జనరల్‌ సెక్రటరీగా ఉత్పల్‌ కుమార్‌ సింగ్‌

30 Nov, 2020 18:40 IST|Sakshi

డెహ్రాడూన్‌: సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఉత్పల్‌ కుమార్‌ సింగ్‌ లోక్‌సభ జనరల్‌ సెక్రటరీగా ఎన్నికయ్యారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా మాజీ సెక్రటరీ జనరల్‌ స్నేహలత శ్రీవాత్సవ స్థానంలో ఉత్పల్‌  కుమార్‌ సింగ్‌ను ఎన్నిక చేసిన్నట్లు సచివాలయం సోమవారం ప్రకటన వెలువరించింది. ఉత్తరాఖండ్ కేడర్‌ 1986 ఐఏస్‌ బ్యాచ్‌కు చెందిన ఆయన డిసెంబర్‌ 1వ తేదీన లోక్‌సభ సెక్రెటరీ జనరల్‌గా‌ బాధ్యతలు చేపట్టానున్నారు. కేబినెట్ సెక్రటరీ హోదాలో లోక్‌సభ జనరల్‌ సెక్రటరీగా ఉత్పల్‌ సింగ్‌ను కొనసాగుతారని సచివాలయం తన ప్రకటనలో పేర్కొంది.

ప్రస్తుతం ఉత్పల్‌ కుమార్‌ సింగ్‌ను లోక్‌సభ సచివాలయంలో కార్యదర్శిగా ఉన్నారు. రెండేళ్లకు పైగా ఆయన ఉత్తరాఖండ్ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఆయనకు 34 ఏళ్ల అనుభవం ఉందని సచివాలయం తన ప్రకటనలో వెల్లడించింది. అంతేగాక ఉత్పల్‌ కుమార్‌ సింగ్ ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థతో పాటు పలు రంగాల్లో మెరుగైన సేవలు అందించారని, ఆయన హయాంలో రాష్ట్రం ఆయా రంగాల్లో అభివృద్దిని సాధించిందని సచివాలయం తెలిపింది.   

మరిన్ని వార్తలు