రోజూ 100కు పైగా పిల్లలపై లైంగిక వేధింపుల కేసులు

23 Nov, 2020 12:55 IST|Sakshi

ప్రతిరోజు 100కు పైగా కేసులు

బాధితులకు అండగా ‘ద వాటర్‌ ఫోనిక్స్‌‌’ సంస్థ

సాక్షి, లక్నో‌: 5 నుంచి 16 ఏళ్ల వయసున్న పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు ఓ వ్యక్తిని బండ జిల్లాలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఈ నెలలో అరెస్ట్ చేసింది. గత 10 సంవత్సరాల కాలంలో 50 మంది పిల్లలను వేధించినట్లు ఆరోపణలున్నాయి. కాగా.. అతను ఉత్తరప్రదేశ్‌లోని నీటిపారుదల విభాగంలో జూనియర్ సిబ్బందిగా పనిచేస్తున్నాడు. పిల్లల ఫోటోలను, వీడియోలను డార్క్ నెట్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పెడోఫిలీస్‌కు విక్రయించాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.   (కరోనా: ఒకే ఇంట్లో ఐదురోజుల్లో ముగ్గురి మరణం​)

అయితే దేశంలో ప్రతిరోజూ 100 మందికి పైగా పిల్లలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) లెక్కలు చెబుతున్నాయి. కానీ,  వాస్తవంగా ఇంతకంటే ఎక్కువ మొత్తంలోనే పిల్లలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. చాలా వరకు ఘటనలు వెలుగులోకి రావడంలేదని, ఇది చాలా తీవ్రమైన సమస్యగా పరిగణించాలని ప్రచారకులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో లైంగిక నేరాల నుంచి పిల్లలను రక్షించే చట్టం (పోక్సో) 2012 అమలుపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లైంగిక వేధింపులు, అశ్లీల చిత్రాల నుంచి పిల్లల రక్షణ కోసం రూపోందించిన సమగ్ర చట్టమిది. ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడం, ప్రత్యేక ప్రాసిక్యూటర్లను నియమించడం, లైంగిక వేధింపులకు గురైన బాధితులకు మద్దతు ఇవ్వడం ద్వారా కొంత వరకు తగ్గించవచ్చు.

న్యాయవ్యవస్థ చిన్న చిన్న లోపాలను ఆసరాగా చేసుకొని నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ సమస్యను కేవలం పోలీసులో, న్యాయ వ్యవస్థనో మాత్రమే కాకుండా మొత్తం సమాజం పరిష్కరించాల్సిన అవసరం ఉంది. రీతూపర్ణా ఛటర్జీ స్థాపించిన ‘ద వాటర్‌ ఫోనెక్స్‌ సంస్థ’ ద్వారా బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని తెలిపేలా ఆమె కృషి చేస్తున్నారు. వేధింపులకు గురైనవారు పరువు కోసం జరిగిన విషయం బయటకి చెప్పలేకపోతున్నారు. అలాంటి పరిస్థితులు మారడానికి సమాజమంతా ఉద్యమించాలని నిపుణులు అంటున్నారు.

మరిన్ని వార్తలు