భారత్-కెనడా వివాదం.. మీమ్స్‌తో నవ్వులు పూయిస్తున్నారు

21 Sep, 2023 18:46 IST|Sakshi

ఇండియా-భారత్ మధ్య దౌత్యపరంగా వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.  ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వం ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్‌లో ఆరోపించడం వివాదానికి తెరలేపింది. అయితే.. ఇరుదేశాల మధ్య నెలకొన్న పరిస్థితులను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.

 వచ్చే జీ20 సమ్మిట్‌లో ఇండియా, కెనడా దౌత్య వేత్తలు ఈ విధంగా కొట్టుకుంటారంటూ ఓ వీడియోను జతచేశారు. ఉత్తరప్రదేశ్‌లో భాగ్‌పత్‌లోని చాట్ సెల్లర్లు కొట్టుకున్న వీడియోను ఇండియా, కెనడా దౌత్య వేత్తలతో ఫన్నీగా పోల్చారు. 


తాజా పరిణామాలతో ఇరుదేశాలు ‘‘నువ్వా-నేనా’’ అన్నట్లు ఆంక్షలు విధించుకునే స్థాయికి చేరాయి. తమ దేశాల్లోని ఇరుపక్షాల దౌత్య వేత్తలను బహిష్కరించుకున్నాయి. కెనడా భారత దౌత్య అధికారులను బహిష్కరించిన కొద్ది గంటల్లోనే ఇండియా కూడా కెనడా దౌత్య అధికారిని దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. కెనడా, యూఎస్, యూకేల్లో పెరుగుతున్న ఖలిస్థానీల మద్దుతుకు మన దేశ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మరో మీమ్‌ను కూడా నెటిజన్లు ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు.


ఇరు దేశాలు అంతటితో ఆగకుండా తమ పౌరులకు ప్రయాణ హెచ్చరికలను జారీ చేశాయి. ఇండియా ఒకడుగు ముందుకేసి కెనడా వీసాలను కూడా రద్దు చేసింది. కెనడాకు పంజాబ్ నుంచి ఎక్కువ సంఖ్యలో వెళ్తుంటారు. వీసాలు రద్దు చేసిన నేపథ్యంలో పంజాబ్ నుంచి వెళ్లేవారి ఇలా ఉంటుందంటూ ఫన్నీగా ఓ వీడియో ట్రోల్ అయింది. 

కెనడాతో ప్రతిష్టంభన నెలకొన్న వేళ ఆదేశానికి వెళ్లాలనుకునే భారతీయులకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాదానికి సంబంధించిన విపత్కర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని స్పష్టం చేసింది. కెనడాలో ఉన్న భారతీయులు, ఆ దేశానికి ప్రయాణించేవారు జాగ్రత్తలు పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. 

ఇదీ చదవండి: కెనడా-భారత్ ప్రతిష్టంభనకు అగ్గి రాజుకుంది అక్కడే..?

మరిన్ని వార్తలు