దేశాన్ని రక్షించేందుకే వచ్చాం!

29 Oct, 2021 15:58 IST|Sakshi

ఇటానగర్‌: ఇండో-టిబెట్ సరిహద్దు సమీపంలోని తవాంగ్ జిల్లాలోని చునాలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రేమ ఖండూ మూడు రోజులు పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో భాగంగా అరుణాచల్ స్కౌట్స్‌కు చెందిన జవాన్లుతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రేమ్‌ ఖండూ మాట్లాడుతూ..."ఈ సరిహద్దు ప్రాంతాల్లో రక్షణ నిమిత్తం ఇండో టిబెట్‌ సరిహద్దుని  2010లో దివంగత దోర్జీ ఖండూజీ ఏర్పాటు చేశారు" అన్న విషయాన్ని గుర్తు చేశారు.

(చదవండి: చీరకట్టు ‘ప్రియుడు’.. ఇది ఏ ఫ్యాషనో తెలుసా?)

ఈ మేరకు ప్రేమ్‌ ఖండూ గౌరవార్థం భారత జవాన్లు "ఉత్తర్ పురబ్ సే ఆయే హమ్ నౌజవాన్, దేశ్ కీ రక్షా కర్నే ఆయా హై(ఈశాన్య ప్రాంతాల నుంచి వచ్చిన యువతరం దేశాన్ని రక్షించేందుకు వచ్చాం)" అనే పాట పాడుతూ డ్యాన్స్‌ చేస్తూ చక్కటి ప్రదర్శన ఇచ్చారు. అంతేకాదు ఖండూ ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. దీంతో నెటిజన్లు భారత ఆర్మీని రకరకాలు ప్రశంసిస్తూ ట్విట్ట్‌ చేశారు. 

(చదవండి: కోతి కళ్లుజోడుని ఎలా తిరిగి ఇచ్చిందో చూడండి!)

మరిన్ని వార్తలు