ఈడీ కస్టడీకి జెట్‌ ఎయిర్‌వేస్‌ ఫౌండర్‌ నరేష్‌ గోయల్‌

3 Sep, 2023 05:50 IST|Sakshi

న్యూఢిల్లీ: కెనరా బ్యాంకును మోసం చేసిన కేసులో శుక్రవారం రాత్రి అరెస్టయిన జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేష్‌ గోయల్‌ను.. మనీ లాండరింగ్‌ కేసులను విచారించేందుకు ఏర్పాటైన ముంబైలోని ప్రత్యేక కోర్టు సెపె్టంబర్‌ 11 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కస్టడీకి పంపుతూ శనివారం ఆదేశించింది.

కెనెరా బ్యాంక్‌ ఫిర్యాదు మేరకు జెట్‌ ఎయిర్‌వేస్‌ ఛైర్మన్‌ నరేష్‌ గోయల్, భార్య అనితపై సీబీఐ మే 3న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. జెట్‌ ఎయిర్‌వేస్‌కు రూ.848.86 కోట్ల రుణ పరిమితులు, రుణాలు మంజూరు చేశామని.. అందులో రూ.538.62 కోట్లు బకాయిలున్నాయన్న కెనరా బ్యాంకు ఫిర్యాదుపై కేసు నమోదైంది.

మరిన్ని వార్తలు