కశ్మీర్‌లో సెంట్‌ బాటిల్‌ ఐఈడీ బాంబ్‌

3 Feb, 2023 06:28 IST|Sakshi

జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో పలు పేలుళ్లతో సంబంధమున్న లష్కరే తోయిబా ఉగ్రవాది ఆరిఫ్‌ను పోలీసులు రేసీ జిల్లాలో అరెస్ట్‌చేశారు. అతని వద్ద సుగంధ ద్రవ్య సీసాలో అమర్చిన అధునాతన పేలుడు పదార్థం(ఐఈడీ)ను స్వాధీనం చేసుకున్నారు.

జమ్మూకశ్మీర్‌లో ఇలా పర్ఫ్యూమ్‌ బాటిల్‌లో ఐఈడీ బాంబ్‌ను స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి అని జమ్మూకశ్మీర్‌ డైరెక్టర్‌ జనరల్‌ దిల్బాగ్‌ సింగ్‌ చెప్పారు. స్ప్రే బటన్‌ను నొక్కడంతో యాక్టివేట్‌ అయిన ఆ బాంబ్‌ను నిర్వీర్యం చేసే పనిలో భద్రతా బలగాలు నిమగ్నమయ్యాయి. ‘ వాస్తవానికి ఆరిఫ్‌ ఉపాధ్యాయుడిగా 12 ఏళ్ల క్రితం ప్రభుత్వ ఉద్యోగంలో చేరాడు. మూడేళ్ల క్రితం కరాచీకి పారిపోయిన మేనమామ ద్వారా కశ్మీర్‌లోని లష్కరే ఉగ్రవాది ఖాసిమ్‌తో సంబంధం పెట్టుకుని ఉగ్రవాదిగా మారాడు’ అని డీజీపీ చెప్పారు.

>
మరిన్ని వార్తలు