ఈ 3 రాష్ట్రాల్లో పాత వాహనాలు ఎక్కువ 

9 Aug, 2021 01:21 IST|Sakshi

దేశంలో కర్ణాటక నంబర్‌ 1  

సాక్షి, బెంగళూరు: దేశంలోనే కర్ణాటకలో అత్యధిక పాత వాహనాలు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఉత్తర కర్ణాటక, ఢిల్లీలో ఎక్కువగా పాత వాహనాలు ఉన్నట్లు ఇటీవల లోకసభలో కేంద్రం బదులిచ్చింది. కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్విని చౌబే పార్లమెంటులో ఈ మేరకు పాత వాహనాల సంఖ్యపై బదులిచ్చారు. అత్యధికంగా కర్ణాటక, ఢిల్లీల్లో పాత వాహనాలు ఉన్నట్లు చెప్పారు.

కర్ణాటక రాష్ట్రంలో 20 ఏళ్లకు పైబడిన వాహనాల సంఖ్య 39.38 లక్షలుగా ఉంది. ఢిల్లీలో 36.14 లక్షల పాత వాహనాలు ఉన్నట్లు మంత్రి తెలిపారు. ఇక 20.67 లక్షల పాత వాహనాలతో ఉత్తరప్రదేశ్‌ మూడో స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా 20 ఏళ్లు దాటిన వాహనాలు మొత్తం 2.15 కోట్లు ఉన్నాయి.  

మరిన్ని వార్తలు