ఫైజల్‌కు శిక్షను ఖరారు చేస్తూ కేరళ హైకోర్టు నిర్ణయం

4 Oct, 2023 21:01 IST|Sakshi

తిరువనంతపురం: లక్షద్వీప్ ఎంపీ ముహమ్మద్ ఫైజల్‌పై మరోసారి అనర్హత వేటు వేస్తూ కింద కోర్టు విధించిన తీర్పు ప్రకారం శిక్షను ఖరారు చేసింది కేరళ హైకోర్టు.

కేంద్ర మాజీ మంత్రి సయ్యద్ అల్లుడు మహ్మద్ సలేహ్‌ హత్యాయత్నం కేసులో దోషిగా తేలడంతో ఈ ఉత్తర్వులపై స్టే విధించాలని మహ్మద్ ఫైజల్ హైకోర్టును కోరగా హైకోర్టు ఆయన అభ్యర్ధనను తిరస్కరించింది. జనవరి 11న ఎంపీ ఫైజల్ ఈ కేసులో దోషిగా తేలిన నాటి నుంచి ఆయనపై అనర్హత వేటు వేస్తున్నట్లు లోక్‌సభ సెక్రటేరియట్ ప్రకటించింది. 

హత్యాయత్నం కేసులో మహ్మద్ ఫైజల్‌పై ప్రాథమిక సాక్ష్యాధారాలున్న నేపథ్యంలో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. శిక్ష అమలుపై స్టే విధించాలన్నది ఫైజల్ డిమాండ్. ఇప్పటికే ఈ కేసులో కవరతి సెషన్స్ కోర్టు పదేళ్ల శిక్ష విధించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం, ప్రజాప్రతినిధికి ఏదైనా నేరంలో రెండేళ్లకు మించి జైలుశిక్ష విధిస్తే ఆయన చట్టసభల సభ్యత్వానికి అనర్హుడవుతాడు.

ఇది కూడా చదవండి: ట్రిపుల్ ఇంజిన్ సర్కార్‌లో ట్రబుల్ షురూ: సుప్రియా సూలే

మరిన్ని వార్తలు