ముకుల్‌ రాయ్‌కు జెడ్‌ కేటగిరి భద్రత తొలగింపు

17 Jun, 2021 11:31 IST|Sakshi

కోల్‌కతా: టీఎంసీ నాయకుడు ముకుల్‌ రాయ్‌కు కేటాయించిన జెడ్‌ కేటగిరీ భద్రతను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) ఉపసంహరించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ముకుల్‌ రాయ్‌ భద్రత విధులు నిర్వహిస్తున్న సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది ఈ ఉదయం నుంచి విధులకు హాజరు కాలేదు. నాలుగు రోజుల క్రితం ముకుల్‌ రాయ్‌ తనకు కల్పించిన భద్రతను ఉపసంహరించుకోవాలని కోరుతూ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. టీఎంసీలో చేరిన ఒక రోజు తర్వాత ముకుల్‌ రాయ్‌ ఈ అభ్యర్థన చేశారు. 

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు 2021 ముందు, రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడులను దృష్టిలో పెట్టుకుని కేంద్రం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పలువురు బీజేపీ నాయకుల భద్రతను పెంచింది. మార్చి 2021 లో, బీజేపీ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ముకుల్ రాయ్ భద్రతను 'వై-ప్లస్' నుంచి 'జెడ్ కేటగిరీ'కి పెంచింది. ఈ క్రమంలో ఆయన తిరిగి టీఎంసీకి చేరడంతో, ముకుల్ రాయ్ తన జెడ్ సెక్యూరిటీ కేటగిరీని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు.

చదవండి: సొంత గూటికి ముకుల్‌ రాయ్‌

మరిన్ని వార్తలు