దారుణం: దెయ్యం పట్టిందని కొడుకును కొట్టి చంపిన తల్లి

22 Jun, 2021 11:51 IST|Sakshi

చెన్నై: వేలూరు: మూఢనమ్మకాలు ఓ బాలుడి ప్రాణాలను బలితీసుకుంది. దెయ్యం పట్టిందని కన్న తల్లే కుమారుడిని కర్రతో కొట్టి హత్య చేసింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం వేలూరులో జరిగింది. వివరాలు.. అరియూర్‌ జేజేనగర్‌కు చెందిన కార్తీ, తిలగవది దంపతులకు కుమారుడు శబరి(7)ఉన్నారు. కార్తీ మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. శబరి పిట్స్‌ వ్యా«ధితో బాధపడే వాడు. అప్పుడప్పుడు ఉన్న ఫలంగా కేకలు వేసేవాడు. దీంతో కుటుంబ సభ్యులు శబరికి దెయ్యం పట్టిందని భావించారు. తిరువణ్ణామలై జిల్లా వందవాసికి చెందిన ఓ పూజారి దెయ్యాన్ని తరిమేస్తాడని కొందరు చెప్పడంతో తిలగవది తన చెళ్లెల్లు కవిత, బాగ్యలక్ష్మిలను వెంట బెట్టుకుని కుమారుడు శబరిని తీసుకొని ఆదివారం సాయంత్రం వందవాసికి ఆటోలో బయలుదేరింది.

ఆటోకు తగిన నగదు ఇవ్వకపోవడంతో ఆటో డ్రైవర్‌ కణ్ణమంగళం కొత్త బస్టాండ్‌ వద్ద నలుగురిని దింపి వెళ్లిపోయాడు. సాయంత్రం చీకటి పడడంతో కణ్ణమంగళం పంచాయితీ కార్యాలయం ముందు నిద్రించారు. సోమవారం వేకువజామున 3 గంటలకు శబరికి ఫిట్స్‌ వచ్చింది. శబరి శరీరంలో దెయ్యం ఉందని.. ఇతన్ని కొడితే దెయ్యం శరీరం విడిచి వెళ్లిపోతుందని ముగ్గురూ కలిసి బాలుడిని కర్రతో కొట్టడంతో మృతిచెందాడు. సోమవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారిని అదుపులోకి విచారిండగా విషయం బటయపడింది.   

చదవండి: 
బంజారాహిల్స్‌: మూడేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. భర్త కొట్టడంతో..

ఇన్‌స్టా పరిచయం.. యువతిని బయటకు రమ్మంటే రాలేదని..

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు