మీ మాట ప్రధాని నోట వినాలంటే.. ఇలా చేయండి

31 Jul, 2021 18:16 IST|Sakshi

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఓ పిలుపునిచ్చారు. రానున్న ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం జరుగుతున్న నేపథ్యంలో ప్రజల ఆలోచనలను తన నోట పలకాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ సారి ప్రధాని జాతినుద్దేశించి ప్రసగించే కార్యక్రమం జరుగుతుంది. సాధారణంగా అయితే ఈ ప్రసంగంలో ప్రభుత్వ కార్యక్రమాలు, విధివిధానాలు, దేశాన్ని అభివృద్ధి బాటలో నడపడం గురించి ఉంటుంది.

కాగా ఈ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం రోజున భారత్‌ను ముందుకు నడిపేందుకు దేశ పౌరులను నుంచి వారి ఆలోచనలను తెలపాలన్నారు. ఎర్రకోట ప్రసంగించే మాటలు తనవే అయినా అది దేశ ప్రజల మనసులో మాటలుగా ఉండాలని మోదీ కోరుతున్నారు. అందుకు గాను ప్రధాని త్వరలో జరగనున్న ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎర్రకోట ప్రసంగంలో తాను ఏం మాట్లాడాలో ప్రజలే చెప్పాలని.. వారి ఆలోచనలు, ఆశయాలను దేశ ప్రజలకు చెబుతానన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌  సిటిజన్ ఎంగేజ్‌మెంట్ ప్లాట్‌ఫారమ్ అయిన MyGovindia లో తమ ఆలోచనలను తెలపాలని కోరారు.


  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు