అయ్యో.. రైలు టిక్కెట్‌ ఉన్నా ఫైన్‌ కట్టారు!

10 Sep, 2022 15:59 IST|Sakshi

కొరుక్కుపేట(చెన్నై): రైలు ప్రయాణికులు టిక్కెట్‌లు తీసుకుని ముందుగానే ప్లాట్‌ఫారానికి వెళ్లి వేచి ఉండటం సర్వసాధారణం. అయితే రైలు టిక్కెట్‌ ఉన్నా ప్లాట్‌ ఫామ్‌ మారడంతో రైల్వే అధికారులు జరిమానా విధించిన ఘటన చెన్నై ఎగ్మూర్‌ రైల్వే స్టేషన్‌లో గురువారం సాయంత్రం జరిగింది. దీంతో ప్రయాణికులు కంగుతిన్నారు.

వివరాలు.. గురువారం సాయంత్రం 5 గంటలకు రామేశ్వరం ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించేందుకు ఆరుగురితో కూడిన ఒక కుటుంబం రైలు ఎక్కాల్సిన ఫ్లాట్‌ ఫామ్‌ బదులుగా వేరే ప్లాట్‌ ఫారానికి వెళ్లారు. అక్కడ టిక్కెట్‌ ఇన్‌స్పెక్టర్లు, ఎగ్జామినర్లు జరిమానా విధించారు. దీంతో ప్రయాణికులు ఎంత వేడుకున్నా టిక్కెట్‌ ఇన్‌స్పెక్లర్లు వదల్లేదు. మహిళా ప్రయాణికులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. దాదాపు అరగంట పాటు హడావుడి నెలకొంది. జరిమానా కచ్చితంగా కట్టాలని చెప్పటంతో చివరికి రూ.1040 జరిమానా చెల్లించి ట్రైన్‌ ఎక్కారు.

చదవండి: వైరల్‌.. చెప్పులతో చితక్కొట్టుకున్న అంకుల్స్‌.. నీ అవ్వ తగ్గేదేలే!

మరిన్ని వార్తలు