ఆ పేలుడు ఘటనలో క్లూ... ఆర్డర్‌ చేసిన పిజ్జా డెలివరీ

10 May, 2022 18:57 IST|Sakshi

Pizza order gave Firs Clue: పంజాబ్‌ పోలీసు ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయం పై రాకెట్‌ దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పూర్తి స్తాయిలో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు పిజ్జా ఆర్డరే వాళ్లకు అసలైన క్లూ ఇచ్చింది. ఇంటెలిజెన్స్ కార్యాలయం పై దాడి జరగడానికి కొద్ది నిమిషాల ముందు ఇంటెలిజెన్స్‌ అధికారి పిజ్జా డెలివరీ కోసం బయటకు వెళ్లినట్టు తెలిసింది. అతను గేటు నుంచి బయటకు రాగనే కార్యాలయానికి సమీపంలో ఆగి ఉన్న తెల్లటి మారుతి స్విఫ్ట్‌ కారును ఆ అధికారి గమనించాడు.

అతను పిజ్జాతో లోపలికి వెళ్లిన మరు క్షణంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో పోలీసులు ఈ కారుపై దృష్టి కేంద్రీకరించారు. అంతేకాదు ఆ ప్రాంతంలోని సీసీఫుటేజ్‌లను, సుమారు 7 వేల మొబైల్‌ డంప్‌లను కూడా పరిశీలిస్తున్నారు. ఇంటర్నేషనల్ బోరర్ (ఐబీ) సమీపంలో డ్రోన్‌తో చిన్న సైజు ఆర్‌పీజీని పడేసి ఉండవచ్చని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఈ దాడి వెనుక ఖలిస్తానీ ఉగ్రవాది హర్విందర్ సింగ్ రిండా హస్తముందని అధికారులు అనుమానిస్తున్నారు.

అయితే అతను గతంలో చేసిన దాడులన్ని సరిహద్దు అవతల నుంచే ప్లాన్‌ చేసేవాడని చెబుతున్నారు. అంతేకాదు ఈ డ్రోన్లు ఒక పెద్ద సవాలని, వాటిని ఆపడానికి ఒక పద్ధతి ఉంటేగానీ ఇలాంటి ఘటనలను ఆపడం అసాధ్యం అని చెప్పారు. పైగా  ఈ దాడి అధికారులను ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయాల్లో భద్రతను మరింత పటిష్టం చేసే దిశగా దృష్టి సారించేలా చేసింది. ఇటీవల కాలంలో పంజాబ్‌లో ఇలాంటి ఘటను మూడు చోటు చేసుకోవడం గమనార్హం.

(చదవడం: పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ కార్యాలయంలో పేలుడు)

మరిన్ని వార్తలు