రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ.. సుప్రీంకోర్టులో పిల్‌

5 Sep, 2023 16:13 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరించడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. లక్నోకు చెందిన న్యాయవాది అశోక్‌ పాండే ఈ పిటిషన్‌ వేశారు. వయనాడ్‌ ఎంపీగా రాహుల్‌ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు.

కాగా మోదీ ఇంటి పేరు వ్యాఖ్యల పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీకి విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆగస్టు 4న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం తీర్పుతో రాహుల్‌పై లోక్‌సభ అనర్హత వేటు తొలిగిస్తున్నట్లు ఆగస్టు 7న లోక్‌సభ సెక్రటేరియట్‌ ఉత్తర్వులు జారీ చేసింది.. ఆయన ఎంపీ సభ్యత్వాన్ని పునురుద్దరించడంతో ఇటీవల జరిగిన పార్లమెంట్‌ సమావేశాలకు రాహుల్‌ హాజరయ్యారు.
చదవండి: ఇండియా పేరు మార్పుపై సోషల్‌ మీడియాలో రచ్చ.. బిగ్‌బీ, సెహ్వాగ్‌, మమతా ట్వీట్లు

అసలేం జరిగిందంటే
 కర్ణాటకలో జరిగిన ఓ ఎన్నికల సభలో రాహుల్‌ మాట్లాడుతూ..‘దొంగలందరికీ మోదీ ఇంటి పేరే ఎందుకుంటుందని  వ్యాఖ్యానించారు. దీనిపై గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారించిన సూరత్‌ కోర్టు మార్చి 23న రాహుల్‌ గాంధీకి రెండేళ్ల శిక్ష విధించింది. ఫలితంగా ప్రాతినిధ్య చట్టం కింద మార్చి 24న లోక్‌సభలో అనర్హుడిగా ప్రకటించడంతో వయనాడ్‌ ఎంపీ పదవి కోల్పోయారు. 

సూరత్‌ కోర్టు విధించిన శిక్షపై రాహుల్‌ హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో ఊరట దక్కపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తాను నిర్దోషినని. తనకు విధించిన శిక్షపై స్టే విధించాలని రాహుల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన అత్యున్నత న్యాయస్థానం ట్రయల్‌ కోర్టు తీర్పును నిలిపివేస్తున్నామని తెలిపింది

మరిన్ని వార్తలు