అయోధ్య మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం.. భావోద్వేగంగా ప్రధాని మోదీ సందేశం

25 Oct, 2023 21:02 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఇవాళ(బుధవారం) రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ సభ్యులు తనను కలిసి ఆహ్వానం అందించారని సంతోషం వ్యక్తం చేశారాయన.  ఈ మేరకు ఎక్స్‌లో భావోద్వేగంగా ఆయన ట్వీట్‌ చేశారు. 

సియా రామ్! ఈ రోజు భావోద్వేగాలతో నిండిన రోజు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధికారులు నన్ను కలవడానికి నా నివాసానికి వచ్చారు. శ్రీరామ మందిర ప్రతిష్ఠాపన సందర్భంగా అయోధ్యకు రావాల్సిందిగా ఆయన నన్ను ఆహ్వానించారు. నా జీవితకాలంలో ఈ చారిత్రాత్మక సందర్భాన్ని చూడటం నా అదృష్టం అని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారాయన. 

జనవరి 22వ తేదీన ఉత్తర ప్రదేశ్‌ అయోధ్య నగర రామ మందిరంలో విగ్రహ ప్రతిష్టాపనతో ఆలయ ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా  ఉన్న 136 సనాతన సంప్రదాయాలకు సంబంధించి పాతిక వేల మంది హిందూ సంఘాల నేతలకు, మరో పాతిక వేల మంది సన్యాసులకు, ఇంకో పదివేల మంది ప్రత్యేక అతిథులకు ఆహ్వానం అందించే యోచనలో ఉంది ట్రస్ట్‌. 

2016లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేసింది. ఆ తర్వాతే కేంద్రం శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ను ఏర్పాటు చేయించి మందిర నిర్మాణం ప్రారంభించింది. 

మరిన్ని వార్తలు