Russia Ukraine War Crisis: ఉక్రెయిన్ అధ్యక్షుడితో మాట్లాడనున్న మోదీ!

7 Mar, 2022 09:25 IST|Sakshi

న్యూఢిల్లీ: ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్‌ల మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరిగిన నేపథ్యంలో ఫిబ్రవరి 26న భారత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా జెలెన్స్కీతో మాట్లాడారు. తదనంతరం మోదీ మళ్లీ ఈ రోజు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌ స్కీతో మాట్లాడే అవకాశం ఉందని భారత ప్రభుత్వ అధికారిక వర్గాలు తెలిపాయి.

ఐక్యరాజ్యసమితిలో ఓటింగ్‌కు భారతదేశం గైర్హాజరైన తర్వాత, జెలెన్స్‌కీ ప్రధాని మోదీతో సంభాషించడమే కాక భారతదేశ రాజకీయ మద్దతును కూడా కోరారు. ఉక్రెయిన్‌ యుద్ధంలో చిక్కుకుపోయిన భారతీయులను తరలించడానికి కేంద్రం ఆపరేషన్ గంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అంతేగాదు భారతీయ పౌరులను సురక్షితంగా నిష్క్రమించడానికి ఇప్పటికే ఉక్రెయిన్‌ను భారత్‌ సంప్రదించింది కూడా.

(చదవండి: మెట్రోలో టికెట్‌ కొని ప్రయాణించిన ప్రధాని మోదీ.. ఎక్కడంటే!)

మరిన్ని వార్తలు