నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు: ప్రధాని మోదీ భావోద్వేగం

18 Jun, 2022 09:30 IST|Sakshi

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తన తల్లి హీరాబెన్‌పై ఉన్న ప్రేమ గురించి అందరికీ తెలిసిందే. ఆమెపై మోదీపై చూపించే అప్యాయతను ఎన్నోసార్లు చూశాము. కాగా,మోదీ తల్లి హీరాబెన్ నేడు(జూన్‌ 18న) వందవ(100) పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. హీరాబెన్‌.. జూన్‌ 18, 1923లో జన్మించారు. ఈ సందర్భంగా మోదీ.. స్వయంగా ఇంటికి వెళ్లి.. తల్లికి పుట్టిన రోజును జరిపారు. తల్లి కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకున్నారు. 

ఈ సందర్బంగా మోదీ ట్విట్టర్‌ వేదికగా.. ‘‘మా.. ఇది కేవలం పదం కాదు. అనేక రకాల భావోద్వేగాలను కూడుకున్నది. ఈ రోజు, జూన్ 18న నా తల్లి హీరాబా తన 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన రోజు. ఈ ప్రత్యేకమైన రోజున, నేను ఆనందం మరియు కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేస్తూ కొన్ని ఆలోచనలను వ్రాసాను’8 అంటూ వ్యాఖ్యలు చేశారు.

అయితే, రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ.. గుజరాత్‌కు వెళ్లారు. తల్లి హీరాబెన్‌ పుట్టినరోజు సందర్భంగా మొదట గాంధీనగర్‌లోని తన ఇంటికి చేరుకుని.. తల్లికి హీరాబెన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తల్లి కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆమె పక్కనే కూర్చున్న మోదీ.. కాసేపు హీరాబెన్‌తో మాట్లాడి బాగోగుల గురించి తెలుసుకున్నారు. అనంతరం, ఇద్దరూ కలిసి అల్పాహారం సేవించారు.

ఇదిలా ఉండగా.. హీరాబెన్‌ 100వ పుట్టినరోజు సందర్భంగా గాంధీనగర్‌ మేయర్‌ హితేష్‌ మక్వానా కీలక ప్రకటన చేశారు. రైసెన్‌ ప్రాంతంలోని 80 మీటర్ల రహదారికి పూజ్య హీరాబా మార్గ్‌ అనే పేరు పెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. దీంతో, ఆమె జీవితం గురించి తర్వాతి తరం స్పూర్తి పొందుతారని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు