దేశ ప్రజలకు రిపబ్లిక్‌ డే శుభాకాంక్షలు : మోదీ

26 Jan, 2021 10:07 IST|Sakshi

ఢిల్లీ : 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం దేశ ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర  మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘ భారత ప్రజలందరికీ రిపబ్లిక్‌ డే శుభాకాంక్షలు. జై హింద్‌’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా నిర్వహించే పరేడ్‌ను దృష్టిలో ఉంచుకొని దేశ రాజధాని ఢిల్లీలో భద్రతా దళాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. కోవిడ్-19 నేపథ్యంలో  ముఖ్య అతిథి లేకుండానే గణతంత్ర వేడుకలు నిర్వహించారు. 

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు దేశ ప్రజలందకి శుభాకాంక్షలు తెలిపారు. 'సర్వసత్తాక, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా.. రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ దేశాభివృద్ధిలో భాగస్వామ్యం వహించేందుకు ప్రతి ఒక్కరం ప్రతిన బూనుదాం' అని ట్వీట్‌ చేశారు. 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు