-

కష్టపడి నది దాటించినా విషాదమే మిగిలింది

23 Jul, 2020 20:09 IST|Sakshi

రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌లో ఒక నిండు గర్భిణిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. తీరా ఆస్పత్రికి వెళ్లాక వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆమె చనిపోయిన బిడ్డకు జన్మనిచ్చారు. వివరాల్లోకి వెళితే.. బీజాపూర్‌ జిల్లాలోని గోర్ల గ్రామానికి చెందిన ఓ గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో బంధువులు ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే మార్గమధ్యలో నదిని దాటేందుకు కుటుంబ సభ్యులు ఆమెను ఓ పెద్ద పాత్రలో ఉంచి.. అవతలి ఒడ్డుకు చేర్చారు. పాత్ర‌లో గ‌ర్భిణిని కూర్చోబెట్టారు. ఆ త‌ర్వాత పాత్ర‌ను క‌ట్టెల స‌హాయంతో మోసుకువ‌చ్చారు.(భారత ఆర్మీ.. కేంద్రం మరో కీలక నిర్ణయం)

ఆ తర్వాత అవతలి ఒడ్డుకు 15 కి.మీ దూరంలోని ఉన్న ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ వైద్యుల తీరు వల్ల ఆ గర్భిణి మృత శిశువుకు జన్మనిచ్చారు. దీంతో వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని గర్భిణి బంధులు ఆరోపించారు.ఈ ఘటనపై స్పందించిన వైద్యాధికారులు.. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.(స్వాతంత్ర్య వేడుకలకు కరోనా వారియర్స్‌)

మరిన్ని వార్తలు