రాజస్తాన్‌లో కలకలం.. ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం

11 Dec, 2020 09:46 IST|Sakshi

జైపూర్: రాజస్తాన్‌లోని కోటా ప్రభుత్వ ఆస్పత్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కేవలం గంటల వ్యవధిలోనే 9 మంది నవశాత శిశువులు మరణించారు. ఇదే ఆస్పత్రిలో ఏడాది క్రితం ఇలాంటి ఘటన చోటు చేసుకోగా.. ఈ ఏడాది కూడా ఇదే రీతిన నవజాత శిశువులు మరణించడం స్థానికంగా కలకలం రేపుతోంది. బుధవారం రాత్రి జేకే లోన్ ఆస్పత్రిలో ఐదుగురు చిన్నారులు మరణించగా, గురువారం మరో నలుగురు శిశువులు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన చిన్నారులంతా 1-4 రోజుల వయస్సులోపు వారే అని రాజస్తాన్ ఆరోగ్య మంత్రి రఘు శర్మ తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. (చదవండి: 480 గ్రాముల శిశువు)

ఆస్పత్రి సూపరింటెండెంట్ సురేష్ దులారా చిన్నారుల మరణాలు సాధారణమైనవేనని తెలిపారు. డివిజనల్ కమిషనర్ కేసీ మీనా, జిల్లా కలెక్టర్ ఉజ్జవల్ రాథోర్ గురువారం సాయంత్రం ఆస్పత్రిని సందర్శించి పరిస్థితిపై ఆరా తీశారు. చిన్నారుల మరణాలపై విచారణకు ఆదేశించినట్లు ఆరోగ్య శాఖ మంత్రి రఘు శర్మ తెలిపారు. శిశువుల చికిత్స కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు. కాగా కోటా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆరోగ్య మంత్రికి పంపిన నివేదిక ప్రకారం, పుట్టుకతోనే వైఫల్యాలు రావడంతో ముగ్గురు శిశువులను జేకే లోన్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వీరికి చికిత్స అందిస్తుండగా.. మరణించారు. మిగితా శిశువులవి ఆకస్మిక మరణాలు అని నివేదికలో తెలిపారు.

మరిన్ని వార్తలు