అయోధ్యలో అక్షత పూజ

6 Nov, 2023 06:06 IST|Sakshi

అయోధ్య: అయోధ్యలో శ్రీరామ మందిరంలో ప్రతిష్టాపన పూజలు ఆదివారం సంప్రదాయం ప్రకారం అక్షత పూజతో మొదలయ్యాయి. ఆలయంలోని రామదర్బార్, శ్రీరాముని ఆస్థానంలో పసుపు, దేశవాళీ నెయ్యి కలిపిన 100 క్వింటాళ్ల బియ్యంతో అక్షత పూజ నిర్వహిస్తున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ తెలిపింది. దేశంలోని 45 ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చిన విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ)కు చెందిన 90 మంది ముఖ్యులకు 5 కిలోల మేర అక్షతలను పంపిణీ చేస్తారు.

వీరు వీటిని జిల్లాలు, బ్లాకులు, తహసీల్‌లు, గ్రామాల ప్రతినిధులకు అందజేస్తారని ట్రస్ట్‌ కార్యదర్శి చంపత్‌రాయ్‌ చెప్పారు. మిగతా అక్షతలను ఆలయంలోని శ్రీరాముని విగ్రహం ఎదురుగా కలశంలో ఉంచుతారు. వీరు ఈ అక్షతలను వీరు వచ్చే జనవరి 22వ తేదీన అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్టాపన జరిగేలోగా దేశవ్యాప్తంగా ప్రజలకు పంపిణీ చేయనున్నారని ట్రస్ట్‌ తెలిపింది.

మరిన్ని వార్తలు