-

ప్రధాని భద్రతలో లోపాలు..ఏడుగురు పోలీసుల సస్పెన్షన్‌

26 Nov, 2023 13:42 IST|Sakshi

చండీగఢ్‌: గత ఏడాది జనవరిలో పంజాబ్‌ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ భద్రతలో లోపాలకుగాను మొత్తం ఏడుగురు పోలీసులు సస్పెండ్‌ అయ్యారు. వీరిలో ఒక ఎస్పీ స్థాయి అధికారి గతంలోనే సస్పెండ్‌ అవగా తాజాగా ఆరుగురిని పంజాబ్‌ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.

ప్రధాని భద్రతలో లోపాలపై సుప్రీం కోర్టు అపాయింట్‌ చేసిన కమిటీ మొత్తం ఏడుగురు పోలీసు అధికారులను బాధ్యులుగా తేల్చింది. వీరందరినీ సీఎం భగవంత్‌మాన్‌ సింగ్‌ నేతృత్వంలోని ఆప్‌ ప్రభుత్వం ఈ నెల 22న సస్పెండ్‌ చేసింది. వీరిలో అప్పటి ఫిరోజ్‌పూర్‌ ఎస్పీ గుర్బీందర్‌ సింగ్‌ గతంలోనే సస్పెండ్‌ అ‍య్యారు. తాజాగా ఆరుగురు అధికారులు వేటుకు గురయ్యారు.

గతేడాది జనవరి 5న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ ప్రచారం కోసం పంజాబ్‌ వెళ్లారు. ఎన్నికల ర్యాలీకి వెళుతున్న ఉన్న ఆయన కాన్వాయ్‌ ఓ ఫ్లై ఓవర్‌పై 20 నిమిషాల పాటు ఎటూ కదలకుండా నిలిచిపోయింది. రైతు చట్టాలపై ఆందోళన చేస్తున్న రైతులు ప్రధాని కాన్వాయ్‌కి ట్రక్కులను అడ్డంగా పెట్టారు. ఈ ఘటనపై అప్పట్లో పంజాబ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రధాన మంత్రి తన టూర్‌ షెడ్యూల్‌ను చివరి నిమిషంలో మార్చుకోవడం వల్లే సమస్య వచ్చిందని అప్పటి సీఎం చన్నీ తెలిపారు.

ఇదీచదవండి..సుప్రీం కోర్టులో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి  

  

     

మరిన్ని వార్తలు