పట్టాలు తప్పిన నార్త్‌ ఈస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ కోచ్‌లు.. ఐదుగురి మృతి!

12 Oct, 2023 05:38 IST|Sakshi

బక్సర్‌:  నార్త్‌ ఈస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ కోచ్‌లు బిహార్‌లోని బక్సర్‌ జిల్లా రఘునాథ్‌పూర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో పట్టాలు తప్పాయి. ఈ రైలు ఢిల్లీ నుంచి అస్సాంకు బయలుదేరింది. బుధవారం రాత్రి 9.35 గంటలకు కొన్ని కోచ్‌లు పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు చెప్పారు.

ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం. 100 మందికిపైగా ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. రైలు కోచ్‌లు పట్టాలు తప్పడం వెనుక కారణాలపై దర్యాప్తు            చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు