బ్రిటీషర్లను తరిమికొట్టిన చీమలు? ‘సిపాయిల తిరుగుబాటు’లో ఏం జరిగింది?

23 Oct, 2023 12:17 IST|Sakshi

ఉత్తరప్రదేశ్‌కు చెందిన అమరవీరులు పండిట్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, అష్ఫాక్ ఉల్లా ఖాన్ దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించారు. వీరేకాదు షాజహాన్‌పూర్ చీమలు కూడా బ్రిటిష్ వారిని తరిమికొట్టేందుకు యుద్ధం చేసి, విజయం సాధించాయి. ఈ ఘటన ‘1857 సిపాయిల తిరుగుబాటు’ సమయంలో జరిగింది. 

చీమల దండు జరిపిన దాడి కారణంగా బ్రిటీషర్లు షాజహాన్‌పూర్‌లో స్థాపించిన కేరు అండ్‌ కంపెనీని మూసివేయవలసి వచ్చింది. చరిత్రకారుడు డాక్టర్ వికాస్ ఖురానా రచించిన ‘షాజహాన్‌పూర్ కా ఇతిహాస్ 1857’ పుస్తకంలోని వివరాల ప్రకారం బ్రిటీష్ వారు 1805లో కాన్పూర్‌లో కేరు అండ్‌ కంపెనీని తొలిసారిగా స్థాపించారు. దానిలో క్రిస్టల్ షుగర్, స్పిరిట్, రమ్ తయారు చేసేవారు. ఈ ఉత్పత్తులను యూరప్‌కు ఎగుమతి చేసేవారు. కాన్పూర్‌లో ఈ వ్యాపారం విజయవంతం కావడంతో బ్రిటీషర్లు 1811లో షాజహాన్‌పూర్‌లోని రామగంగా సమీపంలో మరో యూనిట్‌ ఏర్పాటు చేశారు.

1834లో బ్రిటీషర్లు.. రౌసర్ కోఠి వద్ద మరో యూనిట్‌ను స్థాపించారు. షాజహాన్‌పూర్‌లోని రౌజర్ కోఠి ప్రాంతంలో అధిక విస్తీర్ణంలో చెరకు సాగయ్యేది. దీనికితోడు గర్రా, ఖన్నాత్ నదుల నుండి వాణిజ్యానికి నౌకాయాన సౌకర్యాలు కూడా అందుబాటులో ఉండేవి. 1857లో విప్లవ తిరుగుబాటు సమయంలో విప్లవకారులు ఫ్యాక్టరీని కొల్లగొట్టి, తగలబెట్టారని  డాక్టర్ వికాస్ ఖురానా తెలిపారు. ఈ నేపధ్యంలో కంపెనీ యజమాని జీబీ కెరు ఇక్కడ నుండి తప్పించుకొని మిథౌలీ రాజు సహాయంతో లక్నోకు తరలివెళ్లిపోయాడు. అక్కడ అతను హత్యకు గురయ్యాడు.

తిరుగుబాటు ఆందోళనల తర్వాత ఫ్యాక్టరీ పునఃప్రారంభించారు. వ్యాపారం మరింతగా వృద్ధి చెందింది. అయితే ఆ సమయంలో చీమలు ఆ కంపెనీపై దాడి చేశాయని చరిత్రకారుడు డాక్టర్ వికాస్ ఖురానా, సాహితీవేత్త సుశీల్ తెలిపారు చెప్పారు. కాగా చీమలను తరిమికొట్టేందుకు కంపెనీ యాజమాన్యం పలు చర్యలు చేపట్టింది. అయితే ఆ ప్రయత్నాలు వృథాగా మారాయి. చివరికి బ్రిటీషర్లు  కెరుగంజ్‌లో కంపెనీ పనులను నిలిపివేయవలసి వచ్చింది. కాగా కంపెనీ ఇక్కడ భారీ మార్కెట్‌ను సృష్టించిందని డాక్టర్ ఖురానా తెలిపారు. నేటికీ షాజహాన్‌పూర్‌లోని కెరుగంజ్ మార్కెట్ ఎంతో ప్రసిద్ధి చెందింది. సుదూర ప్రాంతాల వ్యాపారులు కూడా ఇక్కడికి వచ్చి, వారి వ్యాపారాలను కొనసాగిస్తుంటారు.
ఇది కూడా చదవండి: టాయిలెట్‌కు కారు దిగిన భర్త.. అంతలోనే మాయమైన భార్య!

మరిన్ని వార్తలు