Taliban-Kashmir: కశ్మీర్‌పై తాలిబన్ల సంచలన వ్యాఖ్యలు

3 Sep, 2021 12:08 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు కశ్మీర్‌, భారత్ లేదా మరో ఇతర దేశంలో ముస్లింల హక్కులపై మాట్లాడి తీరుతామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింల సమస్యలపై స్పందించే హక్కు తమ కుందన్నారు. తాలిబన్ల పాలనలో అఫ్గన్‌ భూభాగం దేశంలో వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగపడుతుందనే ఆందోళనల మధ్య తాజా వ్యాఖ్యలు మరింత కలవరం రేపుతున్నాయి. 

కశ్మీర్‌తోపాటు మరే ఇతర ప్రాంతంలో ఉన్న ముస్లింల స్వరాన్ని వినిపించే హక్కు సాటి ముస్లింలుగా తమకుందని బీబీసీ ఉర్దూకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాలిబన్ అధికార ప్రతినిధి సుహైల్ షహీన్ స్పష్టం చేశారు. ముస్లింలు  మీ సొంత ప్రజలు, మీ స్వంత పౌరులని చెబుతాం, మీ చట్టాల ప్రకారం వారికీ సమాన హక్కులుంటాయని చెబుతామని వ్యాఖ్యానించారు. కాబూల్‌ను తమ నియంత్రణలోకి తీసుకున్న కొన్ని రోజుల తర్వాత, కాశ్మీర్ ఒక ద్వైపాక్షిక, అంతర్గత విషయమని చెప్పిన దానికి భిన్నంగా తాలిబన్ అధికార ప్రతినిధి తాజా ప్రకటన  ఉంది. అయితే ఏ దేశానికీ వ్యతిరేకంగా ఆయుధాలను ప్రోత్సహించే విధానం తమకు లేదన్నారు.

చదవండి: Taliban China Friendship: చైనా కీలక హామీ, మరింత మద్దతు

మరోవైపు  జమ్మూకశ్మీర్‌లో  పెరుగుతున్న ఆందోళనల మధ్య, ఈ ప్రాంతంలో భారత ప్రభుత్వం ఇప్పటికే నిఘాను పెంచింది. కాగా అమెరికా ఆధీనంలోని అఫ్గాన్‌కు తాలిబన్ల వల్ల విముక్తి లభించిందని, తదుపరి లక్ష్యం కశ్మీరే అంటూ అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ ఇటీవల సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు