దేవాలయాలపై పన్ను: ప్రభుత్వ నిర్ణయం వివాదాస్పదం

1 Dec, 2021 20:07 IST|Sakshi

ప‌ట్న: రాష్ట్రంలోని దేవాల‌యాలపై బిహార్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఆలయాలను రిజిస్టెర్‌ చేయించుకుని ప‌న్నులు చెల్లించాల‌న్న నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బీహార్ స్టేట్ బోర్డ్ ఆఫ్ రిలీజియస్ ట్రస్ట్ తీసుకున్న నిర్ణయంపై ధార్మిక సంస్థలు, భ‌క్తులు భ‌గ్గుమంటున్నారు. వ్యక్తులు త‌మ ఇంటి ప్రాంగణాల్లో దేవాల‌యాలు నిర్మించి భ‌క్తుల‌ను అనుమ‌తించినా కూడా ఈ ఉత్తర్వుల ప‌రిధిలోకి వ‌స్తాయ‌ని తెలిపింది. అదేవిధంగా ఆ ఆల‌యాలు 4 శాతం ప‌న్ను చెల్లించాల‌ని బోర్డు నిర్ణయం తీసుకుంది.

చదవండి: బీజేపీలో చేరిన అకాలీదళ్‌ కీలక నేత..

భ‌క్తులు ద‌ర్శించే పత్రి ఆల‌యాన్ని న‌మోదు చేయించాల‌ని ఆపై వాటికి వ‌చ్చే ఆదాయంలో 4 శాతం ప‌న్ను చెల్లించాల‌ని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్‌, ఏఐఎంఐఎం పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఆల‌యాల‌పై ప‌న్ను విధింపు నిర్ణయాన్ని ‘జిజియా ప‌న్ను’ గా శ్రీరామ జ‌న్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ స‌భ్యులు కామేశ్వర్‌ చౌపాల్ అభివ‌ర్ణించారు. అయితే దీనిపై బీహార్‌ ప్రభుత్వం స్పందిస్తూ.. ఆల‌యాల‌పై తాము ప‌న్ను విధించ‌లేద‌ని తెలిపింది. అయితే అది కేవ‌లం వార్షిక సేవా రుసుమ‌ని వివ‌ర‌ణ ఇచ్చింది.

చదవండి: దేశంలో యూపీఏ లేదు.. మరో కూటమి ప్రయత్నం: మమతా బెనర్జీ

మరిన్ని వార్తలు