Top Trending News: అదిరిపోయే ఆ 10 వార్తలు.. ఒకే చోట!

25 Jun, 2022 16:37 IST|Sakshi

1. Maharashtra Crisis: శివసేన నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి
మహారాష్ట్ర రాజకీయాల్లో సస్పెన్షన్‌ కొనసాగుతోంది. సీఎం ఉద్దవ్‌ ఠాక్రే అధ్యక్షతన శివసేన జాతీయ కార్యవర్గం సమావేశమైంది. ఈ భేటీలో రెబల్‌ ఎమ్మెల్యేలపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరుగుతోంది. వారిని పార్టీ నుంచి తొలగించే అంశంపై ఉద్దవ్‌ఠాక్రే సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. Maharashtra Political Crisis: ‘మహా’పతనం: అసోం సీఎం సంచలన వ్యాఖ్యలు
మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. అసోంలో వరదలపై దృష్టి పెట్టకుండా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు గౌహతి హోటల్‌లో ఆతిథ్యమిచ్చారనే ఆరోపణలపై ఆయన స్పందించారు. మహారాష్ట్ర రెబల్‌ ఎమ్మెల్యేలకు బీజేపీ మద్దతు ఉందని పేర్కొన్నారు.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3రాకేశ్‌ సోదరునికి ఉద్యోగం.. తెలంగాణ సీఎస్‌ ఉత్తర్వులు జారీ
సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్లో జరిగిన హింసాత్మక ఘటనల సమయంలో పోలీసు కాల్పుల్లో మరణించిన దామెర రాకేశ్‌ సోదరునికి ఉద్యోగం కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. ఏపీ: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ జీవో విడుదల
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌కు సంబంధించిన జీవోను శనివారం విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పరీక్ష పాస్ అయిన వారందర్నీ ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం జీవోఎంఎస్‌ నెంబర్ 5ను  జారీ చేసింది. 
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. 'కోహ్లికి ధోని అండ.. పాక్‌లో పుట్టడం నా దురదృష్టం'
పాకిస్తాన్‌ క్రికెటర్లలో మంచి టాలెంట్‌ ఉన్న ఆటగాళ్లలో అహ్మద్‌ షెహజాద్ ఒకడు. 2009లో 17 ఏళ్ల వయసులో పాక్‌ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన అహ్మద్‌ షెహజాద్‌ టాప్‌ ఆర్డర్‌లో ఎక్కువగా బ్యాటింగ్‌కు వచ్చేవాడు. 
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. సొంత అన్న పెళ్లికి నాగశౌర్య డుమ్మా!
టాలీవుడ్‌ యంగ్‌ హీరో ఇంట పెళ్లి బాజాలు మోగాయి. యువ కథానాయకుడు నాగశౌర్య సోదరుడు గౌతమ్‌ ఓ ఇంటివాడయ్యాడు. జూన్‌ 23న నమ్రత గౌడను వివాహమాడాడు. అమెరికాలో ఎంతో గ్రాండ్‌గా వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు సహా అతి కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. ముందుంది పెను ముప్పు తట్టుకోలేరు: యూఎన్‌ చీఫ్‌ సంచలన హెచ్చరిక 
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆహార కొరతపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి సంక్షోభం లాంటి సమస్యలకు తోడు ఉక్రెయిన్‌ యుద్ధంతో తలెత్తిన పరిస్థితుల కారణంగా గ్లోబల్‌  ఆహార విపత్తు పొంచి ఉందని ఆయన హెచ్చరించారు.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. గ్రీన్‌ టీ ఎంత మంచిది? నిజంగానే బరువు తగ్గుతారా?
బరువు తగ్గడానికి తీసుకునే ఆహార పానీయాల్లో గ్రీన్‌ టీ మెరుగ్గా పనిచేస్తుంది. గ్రీన్‌ టీ ఎంత పాపులర్‌ అంటే, ‘డైట్‌’ అనే పదాన్ని ప్రస్తావించినప్పుడు, గ్రీన్‌ టీ అందులో తప్పకుండా ఉంటుంది’’ అని న్యూట్రిషనిస్టులు, డాక్టర్లు చెబుతున్నారు.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. గూగుల్‌ మెచ్చిన డైరీ... నాటి అమానవీయ పరిస్థితులకు అద్దం పట్టేలా..
హోలో కాస్ట్‌ బాధితురాలు (జాతి ప్రక్షాళన లేదా సాముహిక విధ్వంసం) అన్నే ఫ్రాంక్‌ జ్ఞాపకాలకు సంబంధించిన డైరీ. ఈ డైరీ ప్రచురణకు 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా గూగుల్‌ ఈ అందమైన డూడుల్‌ షోతో తెలియపరిచింది. 
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. '48 గంటల్లో నా భార్య ఆచూకీ కనిపెట్టకపోతే.. మా శవాల లొకేషన్‌ షేర్‌ చేస్తా'
వికారాబాద్‌ జిల్లా తాండూరులో బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు దొరిశెట్టి సత్యమూర్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నట్లుగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. పోలీసులు వైఫల్యంతో తన భార్య ఆచూకీ లభించడం లేదని ఆరోపిస్తున్నారు. 
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు