ఉత్తరాఖండ్‌ టన్నెల్‌: మన ఊరూ కాదు,పేరూ కాదు అయినా! ఎవరీ ఆర్నాల్డ్ డిక్స్

29 Nov, 2023 16:01 IST|Sakshi

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా సిల్క్యారా టన్నెల్‌లో చిక్కుకున్నవారిని రక్షించే రెస్క్యూ ఆపరేషన్‌లో కీలకంగా వినిపించిన పేరు ఆర్నాల్డ్ డిక్స్. ఎవరీ డిక్స్‌.. ఈయన ప్రత్యేకత ఏంటి? మన ఊరు కాదు, మన భాషకాదు అయినా అందరితోనూ మమేకమవుతూ రక్షణ చర్యల్లో భాగంగా దేశం కాని దేశం వచ్చి ఇక్కడి కార్మికుల కోసం  24/7 ఎందుకంత  కష్టపడ్డారు? ఇలాంటి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇంటర్నేషనల్ టన్నెలింగ్ ఎక్స్‌పర్ట్  ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్ .ఆస్ట్రేలియా స్వతంత్ర విపత్తు పరిశోధకుడు. అంతర్జాతీయ టన్నెలింగ్ సంఘం అధ్యక్షుడు కూడా. ఉత్తరకాశీ వద్ద సిల్క్యారా టన్నెల్‌ రెస్క్యూ ఆపరేషన్‌కు సవాల్‌గా తీసుకున్నారు. నవంబర్ 20నుంచి రెస్క్యూ ఆపరేషన్‌లో దిగిపోయారు. అప్పటినుంచీ సొరంగంలో చిక్కుకు పోయిన 41 మంది కార్మికులను తన సొంత కొడుకుల కంటే మిన్నగా భావిస్తూ, నిరంతరం వారి  క్షేమం కోసం పరితపించిన వ్యక్తి. అటు కార్మికులతో మాట్లాడుతూ, వారికి భరోసా ఇస్తూనే రక్షణ చర్యల్ని కొనసాగించారు. ఈ ఆపరేషన్‌ సక్సెస్‌ పై ‘17 రోజుల విరామం లేని శ్రమ,  400పైగా గంటలు, 41 మంది  కార్మికులు’  ఎట్టకేలకు వారంతా మృత్యుంజయులుగా బైటపడ్డారు అంటూ నెటిజన్లు ఆనందం వ్యక్తం చేశారు.

 

వినయంగా ఉండాలనే విషయం పర్వతం మాకు  చెప్పింది: డిక్స్ 
భూగర్భ టన్నెలింగ్‌లో ప్రపంచంలోని ప్రముఖ నిపుణుడిగా పేరొందిన ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్ భూగర్భ మరియు రవాణా రంగంలో ప్రత్యేకత ఆయన సొంతం.  నిర్మాణ ప్రమాదాలు, సెక్యూరిటీ చర్యలు, వాస్తవ భద్రతా పనితీరు మొదలు,  ఇతర సాంకేతిక సమస్యల పరిష్కారం వరకూ  ఆయనకు ఆయనే సాటి. 

ఉత్తరకాశీ వద్ద సంఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే, డిక్స్ సిల్క్యారా టన్నెల్ సైట్‌లో తనిఖీ నిర్వహించి, సహాయక చర్యల్లో పాల్గొన్న ఏజెన్సీలతో చర్చించిన తరువాత కార్మికులను రక్షించడంపై భరోసా ఇచ్చారు. కార్మికులకు ఆహారం, నీళ్లు లాంటి అత్యవసర సాయాన్ని అందించారు. వాళ్లతో  ఫోన్లతో మాట్లాడటం, వీడియోలతో కుటుంబ సభ్యులకు కూడా కాస్త ఊరట కలిగింది. అయితే  క్రిస్మస్ నాటికి వారంతా బైటికి వచ్చే అవకాశం ఉందని తొలుత ప్రకటించారు. కానీ ఆయన  అంచనా కంటే ముందుగానే వారిని రక్షించడం విశేషం.

అమెరికా నుంచి తీసుకొచ్చిన ఆగర్‌ డ్రిల్లింగ్ మెషిన్ ఆపరేషన్‌ పగుళ్లతో దీనికి అంతరాయం ఏర్పడింది. ఆగర్‌ ఆపరేషన్‌ను పాజ్ చేశారు. అగర్ డ్రిల్లింగ్ మెషిన్ చివరి భాగం విరిగిపోవడంతో చివరికి ర్యాట్ హోల్ మైనింగ్ నిపుణుల బృందం రంగంలోకి దిగింది. మాన్యువల్‌ డ్రిల్లింగ్‌ ద్వారా కార్మికులను రక్షించే ప్రక్రియ విజయంతంగా పూర్తి అయింది. రెస్క్యూ ఆపరేషన్‌ ఒక కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ఇంతకు ముందెప్పుడూ ఇలా చెప్పలేదు.మంచిగా అనిపిస్తోంది. పర్వతం పైభాగంలో డ్రిల్లింగ్ పర్ఫెక్ట్‌గా  వచ్చిందని మాన్యువల్‌ డ్రిల్లింగ్‌పై సంతోషం వ్యక్తం చేశారు. 

 సోషల్ మీడియా వేదికగా ఆనంద్ మహీంద్రా మంగళవారం  డిక్స్‌ పై ప్రశంసలు

మరిన్ని సంగతులు, అవార్డులు 
♦2011లో, టన్నెలింగ్‌లో ప్రత్యేకించి టన్నెల్ ఫైర్ సేఫ్టీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు అలాన్ నేలాండ్ ఆస్ట్రలేసియన్ టన్నెలింగ్ సొసైటీ ద్వి-వార్షిక అవార్డును అందుకున్నారు. 
♦ డిక్స్‌ న్యాయవాది కూడా బ్రిటిష్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్వెస్టిగేటర్స్‌లో సభ్యుడు. స్పెషలిస్ట్ అండర్‌ గ్రౌండ్ వర్క్స్ ఛాంబర్స్ సభ్యుడు, విక్టోరియన్ బార్ సభ్యుడు , టోక్యో సిటీ యూనివర్శిటీలో ఇంజనీరింగ్ (టన్నెల్స్) విజిటింగ్ ప్రొఫెసర్.
♦ ఇంజనీరింగ్, జియాలజీ, లా రిస్క్ మేనేజ్‌మెంట్ విషయాల్లో మూడు దశాబ్దాలుగా బలమైన కరియర్‌
♦ రిస్క్ అసెస్‌మెంట్ లేదా అంశానికి సంబంధించి చట్టపరమైన , సాంకేతిక పరిమాణాలను అంచనా వేయడంలో దిట్ట. 
♦ లాయర్‌ కూడా కావడంతో లీగల్‌ అంశాలతోపాటు,  పరిశోధకుడిగా, నిపుణుడుగా క్లిష్ట పరిస్థితి అంచనా వేయడంలో సమర్ధుడు. 
 ♦ ముఖ్యంగా  సొరంగాలలో ఫైర్ సేఫ్టీని పెంపొందించడంలో డిక్స్ సంచలనాత్మక విజయాలు సాధించారు. 
 ♦ 2022లో అమెరికా  నేషనల్ ఫైర్ ప్రొటెక్షన్ అసోసియేషన్ కమిటీ సర్వీస్ అవార్డు

 
 
 

మరిన్ని వార్తలు